గ్రామదేవతలకు ఆషాఢ మాస పూజలు
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:58 PM
ఆషాఢ మాసం రాగానే గ్రామాలు, పట్టణాల్లో సైతం గ్రామదేవతలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
ఎర్రగుంట్లలో సారెచీరె సమర్పించిన మహిళలు
ఎర్రగుంట్ల, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఆషాఢ మాసం రాగానే గ్రామాలు, పట్టణాల్లో సైతం గ్రామదేవతలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఎర్రగుంట్ల నడివూరులోని అంకమ్మ దేవాలయం నుంచి గ్రామ దేవతలకు సారే చీరే కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ముందుగా రామాలయం నుంచి మహిళలు ఆల య కమిటీ వారు ముందుగా పెద్దమ్మతల్లికి సారేచీరే సమర్పించి పూజలు నిర్వహిం చారు. అక్కడి నుంచి మేళతాళాలతో ఏరువాక గంగమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చి సారేచీరే మహిళా భక్తులు సమర్పించారు. అనంతరం హారతినిచ్చి భక్తులకు ప్రసాదం పంపిణీచేశారు. అలాగే ముద్దనూరు రోడ్డులోని చ్రౌడేశ్వరీదేవి అమ్మవారికి సారే చీరేను సమర్పించి అక్కడి నుంచి అంకమ్మ దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
ఏరువాకగంగమ్మకు గాజుల అలంకరణ: ఆషాఢమాసం పురస్కరించుకుని ఏరువా క గంగమ్మ అమ్మవారికి గాజుల అలంకరణ అత్యంత వైభవంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా ప్రత్యేకంగా గాజుల దండలను తయారు చేసి శుక్రవారం అమ్మవా రికి సమర్పించారు. వందలాది మంది భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ద్ధలతో పూజలు చేసి అనంతరం అమ్మవారి పల్లకీసేవ నిర్వహించారు.