అంగన్వాడీలకు ఇబ్బందికర యాప్‌లను తొలగించాలి
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:42 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల యాప్‌లు ప్రవేశపెడుతూ అంగన్వాడీలను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తున్నారని తక్షణమే వాటిని ఉపసంహరించాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు.
బద్వేలు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల యాప్‌లు ప్రవేశపెడుతూ అంగన్వాడీలను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తున్నారని తక్షణమే వాటిని ఉపసంహరించాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో బద్వేలు సీడీపీవో శ్రీదేవికి వారొక వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వాలు గంటకో యాప్‌ను ప్రవేశపెట్టి అంగన్వాడీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకుడు నాగేంద్రబాబు, కో కన్వీర్ కొండయ్య, యూనియన ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు రాలు జయప్రద, లక్ష్మినరసమ్మ, సుబాషిణి, సుజాత, అమ్మణ్ణి తదితరులు పాల్గొన్నారు.