కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలి
ABN , Publish Date - May 20 , 2025 | 11:44 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు పిలుపు నిచ్చారు.
ప్రొద్దుటూరు/టౌన, మే 20 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు పిలుపు నిచ్చారు. మంగళవారం స్ధానిక గాంధీ విగ్రహం వద్ద జాతీయ పిలుపు మేరకు ఆందో ళన చేపట్టారు. ఈసందర్బంగా సుబ్బరాయు డు మాట్లాడుతూ 44 కార్మిక రక్షణ చట్టాల ను కేంద్రం రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లను పెట్టిం దని వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఏఐటీ యూసీ పట్టణ అధ్యక్షుడు హరి ,మున్సిపల్ వర్కర్స్ యూనియన కార్యదర్శి మధు, ఆటోయూని యన సహాయకార్యదర్శి నరసింహ హమాలి వర్కర్స్ యూనియన కార్యదర్శి గురవయ్య పాల్గొన్నారు. కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కార్మికుల హక్కులను పరిరక్షించాలని పాత బస్టాండు నుంచి శివాలయం సెంటర్ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజే పీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్మికుల చట్టాలన్నింటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చారన్నారు. కార్యదర్శి సాల్మన్, రాఘవ, మోహన్, అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి సుబ్బలక్ష్మి, సునీత, ప్రమీళమ్మ, రమణమ్మ, మెడికల్ రెప్స్ యూనియన్ కార్యదర్శి నరసింహారెడ్డి, పశువైద్య కళాశాల యూనియన్ నాయకుడు సుబ్బారావు, ఐఎంఎన్ యూనియన్ నాయకుడు క్రిష్ణయ్య, సంజీవ, పాల్గొన్నారు.
బద్వేలులో: కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కాలరాయాలని చూడడం తగదని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సీఐటీయూ ఆఽధ్వర్యంలో మంగళవారం ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి నాగేంద్ర బాబు మాట్లాడుతూ కార్మికుల హక్కులను అమలు పరిచి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టని సమక్షంలో జూలై 9న సార్వత్రిక సమ్మె నిర్వహిస్తామన్నారు. సీఐటీయూ పట్టణ నాయకులు నాగర్జున, సుబ్బరాయుడు, శివకుమార్, హరి పాల్గొన్నారు.
కలసపాడులో: తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని అంగన్వాడీ వర్క ర్స్, హెల్పర్స్ నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నిరసన తెలుపుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇచ్చి పింఛన, పీఎఫ్, అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆవాజ్ నాయకుడు నాగూర్‌వల్లి, హుసేనపీరా, అంగన్వాడీ నాయకురాలు విజయమ్మ, మేరీ, ఓబులమ్మ, వసుంధర,రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కొండాపురంలో: దేశవ్యాప్త సార్వత్రికసమ్మెలో భాగంగా కార్మికసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌కోడ్లను రద్దు చేయాలని, సమానపనికి సమానవేతతనం కల్పించాలని, కార్మికచట్టాలను అమలుచేయాలని తదితర డిమాండ్లతో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ గురప్పకు నాయకులు వినతిపత్రం అందజే శారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఐ, అంగన్వాడీ, ఆశావర్కర్ల ఆటోవర్కర్ల యూనియన నేతలు మనోహర్‌బాబు, వెంకటరమణ,వరలక్ష్మి, పద్మావతి, జ్యోతి, తారాదేవి, సుబ్బారావు పాల్గొన్నారు.
పోరుమామిళ్లలో : ఉపాఽధి కూలీలకు 200 రోజులు పనిదినాలు కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు భైరవ ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్ల లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని, కనీసం వేతనం రూ.26వేలు కల్పించాలన్నారు. ర ఉపాధి కూలీకి కనీసం రోజుకు రూ.800 కల్పించాలన్నారు. అసం ఘటితరంగ కార్మికులకు ఉన్న సంక్షేమబోర్డు ఎత్తివేయ డం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకురాలు గౌసియబేగం, రవి ప్రసాద్ పాల్గొన్నారు.