Share News

వైభవంగా ఆంజనేయస్వామి ఉత్సవాలు

ABN , Publish Date - May 30 , 2025 | 12:08 AM

మండలంలోని రాజువారిపేట గ్రామంలో అభయ ఆంజనేయస్వామి ఉత ్సవాలు వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ఆంజనేయస్వామి ఉత్సవాలు
కోలాటం ఆడుతున్న మహిళలు

చాపాడు, మే 29 (ఆంధ్రజ్యోతి): ఈ సందర్భంగా ఆంజనేయస్వామి వారిని గ్రామంలో ఊరేగింపు జరిపారు. గురువారం ఓల్డ్‌ కేటగిరి ఎద్దులకు బండలాగుడు పోటీలు నిర్వహించగా ప్రొద్దుటూరు మండలం రంగసాయిపల్లె గ్రామానికి చెందిన మార్తల వెంకటసుబ్బారెడ్డి ఎడ్లు 3,903 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.50 వేలు గెలుచుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. రాజువారిపేట గ్రామానికి చెందిన లింగారెడ్డి శ్రీకాంత్‌రెడ్డి ఎడ్లు 3,758 అడుగులు లాగి రెండవ బహుమతి రూ.40 వేలు, అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాయపల్లె గ్రామానికి చెందిన శ్రీరాములు ఎద్దులు 3,630 అడుగులు లాగి మూడవ బహుమతి రూ.30 వేలు గెలుచుకున్నాయి. మహిళలు ఆడిన కోలాటం పలువురిని బాగా ఆకట్టుకుంది.

Updated Date - May 30 , 2025 | 12:08 AM