రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తే చర్యలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:47 PM
రైతుల వద్ద మరమ్మతులకు డబ్బులు వసూలు చేస్తే సస్పెండ్ చేస్తామని జిల్లా విద్యుత్తు శాఖ ఎస్‌ఈ రమణ పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో ట్రాన్స్‌ఫార్మర్‌ను
పరిశీలిస్తున్న ఎస్‌ఈ రమణ
ఖాజీపేట, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రైతుల వద్ద మరమ్మతులకు డబ్బులు వసూలు చేస్తే సస్పెండ్ చేస్తామని జిల్లా విద్యుత్తు శాఖ ఎస్‌ఈ రమణ పేర్కొన్నారు. మంగళవారం ఖాజీపేట సబ్‌స్టేషన్ ట్రాన్స్‌ఫార్మర్లను, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యత్తును అందించాలని సిబ్బందిని ఆదేశించారు. లైన్లకు అడ్డు ఉన్న చెట్లను, ఒరిగిన స్తంభాలను, మనిషికి అందే ఎత్తులో ఉన్న విద్యుత్తు వైర్లను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. ఎవరైనా విద్యుత్తు సిబ్బంది డబ్బులు అడిగితే 9440811751కు ఫిర్యాదు చేయాలని ఆయన రైతులను కోరారు. కార్యక్రమంలో మైదుకూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు భరణీకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీరు నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మైదుకూరు రూరల్‌లో : విద్యుత్‌బకాయిలను రాబట్టడంలో జాప్యం మహించవద్దని జిల్లా విద్యుత్తు శాఖ ఎస్‌ఈ రమణ అన్నారు. స్థానిక విద్యుత్‌శాఖ కార్యాలయం వద్ద మంగళవారం విద్యుత్ అధికారుల సమావేశంలో విద్యుత్‌ను ఎలా ఆదా చేసుకోవాలని ,విద్యుత్ చౌర్యం జరుగకుండా ఎలా చూడాలని అనే విషయాలపై చర్చించారు.