ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:25 AM
వ్యాపారులు యూరియా, ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలని అధిక రేట్లకు విక్రయిస్తే చర్యలు తప్పవని విజిలెన్స సీఐ శివన్న పేర్కొన్నారు.
బద్వేలు , సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి)ఃవ్యాపారులు యూరియా, ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలని అధిక రేట్లకు విక్రయిస్తే చర్యలు తప్పవని విజిలెన్స సీఐ శివన్న పేర్కొన్నారు. శుక్రవారం బద్వేలు పట్టణంలోని పలు ఎరువుల షాపులను విజిలెన్స అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపుల వారు రైతులకు అవసరమైన యూరియా సిద్ధంగా ఉందని వారిని ఇబ్బందిపెట్టకుండా చూడాలని సూచించారు. యూరియాతోపాటు రైతులకు అవసరమైన ఎరువులన్నీ సిద్ధంగా ఉన్నాయని, షాపు యజమానులు ఎవరైనా రైతులకు ఎరువులు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువులపైన రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈకార్యక్రమంలో విజిలెన్స అధికారులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.