Share News

ఉపాఽధిలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:31 PM

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పటి ష్టంగా అమలు చేస్తున్నామని, ఇందు లో ఏవైనా అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని డ్వామా ప్రాజెక్టు డైరెక్టరు ఆదిశేషారెడ్డి పేర్కొన్నారు.

 ఉపాఽధిలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు
ప్రజావేదికలో మాట్లాడుతున్న డ్వామా ప్రాజెక్టు డైరెక్టరు ఆదిశేషారెడ్డి

రాజుపాలెం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పటి ష్టంగా అమలు చేస్తున్నామని, ఇందు లో ఏవైనా అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని డ్వామా ప్రాజెక్టు డైరెక్టరు ఆదిశేషారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 19వ విడత సామాజిక తనిఖీ బహిరంగ సమావేశంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టరు మాట్లాడుతూ సామా జిక తనిఖీల్లో 2024-25 మార్చి నెలాఖరు వరకు ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులను సోషల్‌ ఆడిట్‌ సిబ్బంది ద్వారా వివరాలు సేకరించి ఇందులో లోటుపాట్లను గుర్తించామన్నారు. రాజుపాలెం మండలానికి సంబంధించి ఈ పథకం ద్వారా రూ.9.35 కోట్లతో పనులు చేపట్టామని అందులో ఉపాధి హామీ కూలీలకు రూ.4కోట్లు, మిగతా రూ.5.35 కోట్లు మెటీరియల్‌ రూపంలో ఉంటుందన్నారు. గ్రామాల వారీగా లోటుపాట్ల ను గుర్తించి ఏమైనా ఉంటే రికవరీ చేయడం, అంతకు మించి ఉంటే చర్యలు తీసు కోవడం జరుగు తుందన్నారు. కార్యక్రమంలో ఉప ఎంపీపీ నారాయణరెడ్డి, అడిషనల్‌ పీడీ రామలింగేశ్వర్‌రెడ్డి, జిల్లా విజిలెన్స ఆఫీసరు జుబేదా, విజయభాస్కర్‌, డీఆర్‌డీఏ ఏపీడీ వెంకటేశ్వర ప్రసాద్‌, ఎస్‌పీఎం కోనయ్య, పంచాయతీరాజ్‌ డీఈ లక్ష్మి నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 11:31 PM