Share News

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే చర్యలు : సీఐ

ABN , Publish Date - Jun 20 , 2025 | 11:26 PM

ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పని తప్పవని రాయచోటి అర్బన సీఐ వెంకటచలపతి ఆటో డ్రైవర్లను హెచ్చరించారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే చర్యలు : సీఐ
ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్‌ ఇస్తున్న రాయచోటి అర్బన సీఐ వెంకటచలపతి

రాయచోటిటౌన,జూన20(ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పని తప్పవని రాయచోటి అర్బన సీఐ వెంకటచలపతి ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. శుక్రవారం ఆయన రాయచోటి అర్బన పోలీసు స్టేషనలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఆ టో డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని, వాహనాల రికార్డులను, లైసెన్సులను తప్పనిసరిగా కలి గి ఉండాలని సూచించారు. వాహనానికి సం బంధించిన అన్ని రికార్డులను కలిగి ఉండాలని, ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తిస్తూ ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా వాహనదారులకు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా నడుచుకోవాలన్నారు. ఎవరైనా ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘిస్తే అ టువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన సీఐ ఆటో డ్రైవర్లను హెచ్చరించారు.

Updated Date - Jun 20 , 2025 | 11:26 PM