ప్రజలు మెచ్చిన పాలనకు ఏడాది
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:45 PM
ప్రజలు మెచ్చిన పాలనకు ఏడాది పూర్తయిందని టీడీపీ యువ నాయకుడు ముక్కా విశాల్‌రెడ్డి, ముక్కా సాయివికా్‌సరెడ్డి అన్నారు.
రైల్వేకోడూరు, జూన 12(ఆంధ్రజ్యోతి): ప్రజలు మెచ్చిన పాలనకు ఏడాది పూర్తయిందని టీడీపీ యువ నాయకుడు ముక్కా విశాల్‌రెడ్డి, ముక్కా సాయివికా్‌సరెడ్డి అన్నారు. కూట మి గెలుపును ప్రతి కార్యకర్తకు అంకితం చేస్తున్నామన్నారు. గురువారం రైల్వేకోడూరు మండలంలోని రాఘవరాజపురం వద్ద ఉన్న టీడీపీ కార్యాలయ ఆవరణం లో కేక్ కత్తిరించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతికార్యకర్తా అంకితభావంతో పనిచేశారని గుర్తు చేశారు. వచ్చే నాలుగేళ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపతామన్నారు. రైల్వేకోడూరు నియోజకరవ్గంలోని అన్ని గ్రా మాలను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో నా యకులు బత్తిన వేణుగోపాల్‌రెడ్డి, మలిశెట్టి మురళీధర్‌గౌడు, కట్టా బాలాజీ పాల్గొన్నారు.