వేధిస్తున్న సిబ్బంది కొరత
ABN , Publish Date - Aug 19 , 2025 | 10:50 PM
మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్లల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి. మండలంలో సుమారు ఏడు వేల వ్యవసాయ కనెక్షన్లు, 16 వేల దాకా గృహ విని యోగ కనెక్షన్లు ఉన్నాయి. నాణ్యమైన విద్యుత్‌ను అందించలేక పోతున్నారు. అంతేకాకుండా సిబ్బం ది కొరతతో పలు అంతరాయాలు ఏర్పడుతున్నా యి.
ఇబ్బడి ముబ్బడిగా మరమ్మతు పనులు
విద్యుత్ సరఫరాలో అంతరాయం
ప్రైవేటు వారితో రైతుల పనులు
సిబ్బందిని నియమించాలని వేడుకోలు
పెద్దతిప్పసముద్రం ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్లల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి. మండలంలో సుమారు ఏడు వేల వ్యవసాయ కనెక్షన్లు, 16 వేల దాకా గృహ విని యోగ కనెక్షన్లు ఉన్నాయి. నాణ్యమైన విద్యుత్‌ను అందించలేక పోతున్నారు. అంతేకాకుండా సిబ్బం ది కొరతతో పలు అంతరాయాలు ఏర్పడుతున్నా యి. దీంతో రైతులు ప్రైవేటు వర్కర్లను ఆశ్రయి స్తున్నారు. అయినా డబ్బు, సమయం వృథా అవుతోందే తప్ప సమస్య తీరడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులను రైతులు వేడుకుం టున్నారు. వివరాల్లోకెళితే....
మండల పరిధిలో పెద్దతిప్పసముద్రం సహా రంగసముద్రం, మల్లెల, కందుకూరు, వరికసువు పల్లె, గ్రామాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో 24 మంది విద్యుత్ సిబ్బంది ఉండాల్సి ఉంది అయితే కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే రైతుల పొలాల్లో ఏదో ఒక విద్యుత్ సమస్య తలెత్తుతోంది. ఆ సమస్యలను పరిష్కరిం చాలంటే తగినంత సిబ్బంది లేకపోవడంతో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించక పోవ డంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.
మారుమూల గ్రామాల్లో రాత్రిళ్లు విద్యు త్ సమస్యలు ఏర్పడితే చిన్నచిన్న మరమ్మతులు సైతం చేయాలన్నా ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిం చాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
బోర్ల వద్ద ఫీజులు పోయినా...
రైతుల వ్యవసాయ బోర్లకు అమర్చిన ట్రాన్స్ ఫార్మర్ వద్ద కనీసం ఫీజు పాడైనా అమర్చే వారు లేక రైతులే వేసుకోవాల్సి వస్తోంది. రైతులకు ప్రభుత్వం అందించే 9 గంటల విద్యుత్ రెండు విడతలుగా అందిస్తున్నారు. ఉదయం 5 గంటలు, రాత్రి వేళల్లో 4 గంటల విద్యుత్‌ను రైతులకు అందిస్తున్నారు. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడితే వాటిని సరిచేసే సిబ్బంది లేక పోవడంతో రైతులే వాటిని సరిచూసుకోవాల్సి వస్తోంది. దీంతో గతంలో పీటీఎం మండలంలో అనేక విద్యుత్ ప్రమాదాలు సైతం చోటుచేసుకు న్నాయి. రైతుల బోర్లకు విద్యుత్ సమస్యలు ఎదు రైతే ప్రైవేటు మెకానిక్‌లను సంప్రదించి మరమ్మ తులు చేసుకుంటే వారికి అధిక మొత్తంలో ముట్టచెప్పాల్సిన పరిస్థితి రైతుల్లో నెలకొంది.
కొత్త సర్వీసులు అమర్చాలంటే...
రైతులు బోర్లను వేసుకుని వాటికి కొత్తగా సర్వీసు అమర్చుకోవాలంటే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిం చాలి. రైతులకు పనులు జరగాలంటే ప్రైవేటు వారి చేత పనులు చేసుకోవాల్సి వస్తోంది. రైతుల కు మంజూరైన విద్యుత్ సామగ్రి అందించాలన్నా, సామగ్రిని రైతులకు చేర్చాలన్నా ప్రైవేటు కార్మి కుల చేత చేయించుకోవాల్సిన పరిస్థితి.
రైతుల పొలాల్లో చిన్న చిన్న మరమ్మతులు చేయాలన్నా ప్రైవేటు కార్మికులే దిక్కు. రైతుల పొలాల సమీ పంలో విద్యుత్ వైర్లు చేతికి అందేంత ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నా వాటిని పైకి లాగాలన్నా తగిన సిబ్బంది లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి.
రైతుల ట్రాన్స్ పార్మర్లు కాలిపోతే రైతులే...
వివిధ గ్రామాల్లో రైతుల ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే సంబంధిత లైన్‌మాన్ ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసు కెళ్లి ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతులు చేయించి ట్రా న్స్‌ఫార్మర్‌ను లైన్‌మాన్ బిగించాలి. అయితే సిబ్బంది కొరత కారణంగా తమ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే రైతులు ప్రైవేటు కార్మికుల చేత ట్రాన్స్ ఫార్మర్‌ను తీసుకెళ్లి తామే తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు చేయించుకుంటుండ డంతో రైతులకు అధిక భారం పడుతోంది. కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలానికి అవసరమైన సిబ్బందిని నియమిం చాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు.
సిబ్బంది కొరత వాస్తవమే
మండలంలోని గ్రామాల్లో లైన్‌మన్‌లు, జూని యర్ లైన్‌మన్‌లు, ఎనర్జీ అసిస్టెంట్లు, లైన్ ఇన్ స్పెక్టర్లు కొరత ఉండడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. వీటిని అధిగమిం చేందుకు తగిన సిబ్బందిని నియమించాలని గతంలోనే ఉన్నతాధికారులకు నివేదించామన్నా రు. ఉన్న సిబ్బందితోనే పనులు చేయిస్తున్నామని, విద్యుత్ సరఫరాలో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు.
గిరిధర్, ఏఈ పెద్దతిప్పసముద్రం