Share News

ప్రశాంతంగా పాలిసెట్‌ పరీక్ష

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:49 PM

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నికల్‌ కళాశాలలో ప్రవేశానికి బుధవారం రాజంపేటలో నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా పాలిసెట్‌ పరీక్ష
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న తహసీల్దారు పీరుమున్ని

రాజంపేట, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నికల్‌ కళాశాలలో ప్రవేశానికి బుధవారం రాజంపేటలో నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నికల్‌, ఫార్మసి కళాశాలలో పరీక్ష నిర్వహించారు. పాలిసెట్‌ కో ఆర్డినేటర్‌, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై.సుధాకర్‌ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్షలకు 975 మంది హాజరు కావాల్సి ఉండగా 892 మంది హాజరయ్యారు. 83 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను రాజంపేట తహసీల్దారు పీరుమున్ని, ఎంఈవో సుబ్బరాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మన్నూరు సీఐ కుళాయప్ప, సిబ్బంది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 30 , 2025 | 11:50 PM