అలరించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:18 AM
రామాపురం ఏపీ మోడల్ స్కూల్‌లో 2015-16 విద్యా సంవత్సరంలో 10వ తర గతి పూర్తి చేసిన పూర్వపు విద్యార్థులు ఆదివారం తమ పాఠశాలలో ఘనంగా పూర్వపు విద్యార్థుల సమ్మేళనం (గెట్- టుగెదర్) నిర్వహించుకున్నారు.
రామాపురం, జూన8(ఆంధ్రజ్యోతి): రామాపురం ఏపీ మోడల్ స్కూల్‌లో 2015-16 విద్యా సంవత్సరంలో 10వ తర గతి పూర్తి చేసిన పూర్వపు విద్యార్థులు ఆదివారం తమ పాఠశాలలో ఘనంగా పూర్వపు విద్యార్థుల సమ్మేళనం (గెట్- టుగెదర్) నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనుమతిచ్చిన జిల్లా విద్యాశాఖాధికారికి, ప్రస్తుత ప్రిన్సిపాల్ శ్యామలాదేవిలకు పూర్వపు విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.