యోగాంధ్రతో ఆరోగ్యాంధ్ర సాధించాలి : ఆర్డీవో
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:08 AM
యోగాంధ్రతో ఆరోగ్యాంధ్ర సాధించాలని ఆర్డీవో జాన ఇర్విన అన్నారు.
సిద్దవటం, జూన 5 (ఆంధ్రజ్యోతి): యోగాంధ్రతో ఆరోగ్యాంధ్ర సాధించాలని ఆర్డీవో జాన ఇర్విన అన్నారు. గురువారం సిద్దవటంలో పురావస్తుశాఖ కోట, పార్కు ప్రదేశంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజుకు కేవలం 30 నిముషాలు యోగా చేస్తే శారీరక దృఢత్వం, మానసిక శాంతి సిద్ధిస్తాయని, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. జిల్లా యోగా స్పెషల్ ఆఫీసర్ సురే్‌షబాబు మాట్లాడుతూ యో గా కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహిస్తే మేలన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ జయసింహ, తహసీల్దారు ఆకుల తిరుమలబాబు, మండల అఽబివృద్ధి అధికారి పణిరాజకుమారి, డీటీ మాధవిలత, ఆయుష్ వైద్యులు మురళీబాబు, ఎస్‌ఎండీ హమీద్, అల్లోపతి వైద్యులు డాక్టర్ ప్రకాష్, రంగలక్ష్మీ, పంచాయతిరాజ్ ఏఈ నాగరాజు, ఎస్‌ఐ మహ్మద్‌రఫీ, మండల విస్తరణాధికారి మెహతాజ్‌యాస్మిన, ఉపాధి హా మీ ఏపీవో నరసింహులు, పంచాయతీ సెక్రటరీలు, రెవె న్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.