20 మంది కంటి రోగులకు ఆపరేషన్లు
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:29 PM
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణ పరిధిలోని చెన్నముక్కపల్లెలో గల లయన్స కంటి ఆసుపత్రిలో ఆదివారం జరిగిన కంటి వైద్య శిబిరంలో 20 మందికి ఆపరేషన్లు నిర్వహించారు.

రాయచోటిటౌన, జూన15(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణ పరిధిలోని చెన్నముక్కపల్లెలో గల లయన్స కంటి ఆసుపత్రిలో ఆదివారం జరిగిన కంటి వైద్య శిబిరంలో 20 మందికి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంతో పాటు రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, కలకడ, చక్రాయపేట, ఎనపీకుంట తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 40 మంది కంటి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన కంటి వైద్యులు అందులో అర్హులైన 20 మంది కంటి రోగులకు ఆపరేషన్లు నిర్వహించారు. అలాగే గతంలో ఆపరేషన చేయించుకున్న 32 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, అద్దాలు పంపిణీ చేశారు. కంటి వైద్య శిబిరానికి హాజరైన కంటి రోగుల సౌకర్యార్థం దాతలు భోజన వసతి కల్పించారు. కంటి ఆసుపత్రి చైర్మన వైవీఆర్ స్వరూపగుప్త, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన చెన్నూరు అన్వర్‌బాషా, మాజీ సర్పంచ శ్రీనివాసులరెడ్డి, కంటి వైద్యులు సురేశబాబు, భార్గవి, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ మూలి రాజగోపాల్‌రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.