కబడ్డీ విజేత విశాఖపట్నం
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:45 PM
మూల్పూరి రంగారావు స్మారక 50వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ చాంపియన పోటీల్లో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచి డబుల్ క్రౌన సాధించింది.

కర్నూలు స్పోర్ట్స్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మూల్పూరి రంగారావు స్మారక 50వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ చాంపియన పోటీల్లో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచి డబుల్ క్రౌన సాధించింది. రన్నర్‌గా కర్నూలు బాలబాలికలు నిలిచారు. కర్నూలు డీడీపాడు కేఈ ప్రభాకర్ ఫాంహౌ్‌సలో నిర్వహించిన ఫైనల్ మ్యాచలో విశాఖపట్నం బాలుర జట్టు కర్నూలుపై 27-25 పాయింట్లతో నెగ్గింది. మూడో స్థానంలో చిత్తూరు, నాల్గవ స్థానంలో అనంతపురం జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో విశాఖపట్నం జట్టు కర్నూలుపై 37-30 పాయింట్లతో విజయం సాధించింది. చిత్తూరు జట్టు తృతీయ స్థానం సాధించింది. విజేతలకు టోర్నమెంటు అధ్యక్షుడు కేఈ ప్రభాకర్, కేవీ సుబ్బారెడ్డి, మల్లికార్జున రెడ్డి టోర్నమెంటు కప్‌ను అందజేశారు. ఈసీఎం నీలకంఠయ్య, మాజీ కబడ్డీ సంఘం కార్యదర్శి రాజశేఖర్ ప్రస్తుత కార్యదర్శి సుభాకర్, డీఎ్‌సడీవో భూపతిరావు పాల్గొన్నారు.