Share News

Tirumala Visit: శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:20 AM

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని కూడా ఆయన దర్శించుకున్నారు

Tirumala Visit: శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ

తిరుమల, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆదివారం రాత్రి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు పద్మావతి అతిథిగృహం వద్ద ఆయనకు టీటీడీ రిసెప్షన్‌ అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి బస, దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా, సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు.

Updated Date - Apr 21 , 2025 | 04:21 AM