Tirupati Tragedy: తొక్కిసలాటపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటైంది
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:56 AM
భక్తుల మృతి ఘటనపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్.ప్రణతి బుధవారం హైకోర్టుకు నివేదించారు.

హైకోర్టుకు నివేదించిన ఎస్‌జీపీ.. తీర్పు రిజర్వ్
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, భక్తుల మృతి ఘటనపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్.ప్రణతి బుధవారం హైకోర్టుకు నివేదించారు. పిటిషనర్.. కర్నూలు జిల్లాకు చెందిన గుదిబండ ప్రభాకర్‌రెడ్డి తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తొక్కిసలాటపై విచారణ జరిపి నెలరోజుల్లో నివేదికను గవర్నర్‌కు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. నివేదికను నెలలో ఎలా ఇవ్వగలరని ప్రశ్నించింది. ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించినందున పిల్ నిరర్ధకం అవుతుందని, దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం పేర్కొంది.
డీజీపీ నియామకంపై సుప్రీంకు వెళ్లండి
డీజీపీ నియామకంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించడం లేదంటూ దాఖలైన పిల్‌పై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులతో ముడిపడి ఉన్నందున, సమాంతరంగా పిల్‌పై తాము విచారణ జరపలేమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
హైకోర్టు జీపీగా కనకరాజు
ఏపీ హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాది ఉండ్రాజవరపు కనకరాజు జీపీగా నియమితులయ్యారు. మరోవైపు ఏపీపీఎస్సీ స్టాండింగ్ కౌన్సిల్‌గా న్యాయవాది జి.శీనాకుమార్, వక్ఫ్‌బోర్డు స్టాండింగ్ కౌన్సిల్‌గా న్యాయవాది మహ్మద్ సలీం పాషాను నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం..
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
For AndhraPradesh News And Telugu News