Esther Anuhya: భగవంతుడికే వదిలేస్తున్నా..!
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:14 AM
తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేవుడికే వదిలివేస్తున్నానని ఎస్తేర్ అనూహ్య తండ్రి జొనాథన్ ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శింగవరపు ఎస్తేర్ అనూహ్యపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు చంద్రభాన్ సన్‌పను సుప్రీంకోర్టు మంగళవారం నిర్దోషిగా ప్రకటించడంపై బుధవారం ఆయన స్పందించారు.

ఈ వయసులో మేమిక పోరాడలేం
ఎస్తేర్ అనూహ్య తండ్రి ప్రసాద్ నిర్వేదం
మచిలీపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేవుడికే వదిలివేస్తున్నానని ఎస్తేర్ అనూహ్య తండ్రి జొనాథన్ ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శింగవరపు ఎస్తేర్ అనూహ్యపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు చంద్రభాన్ సన్‌పను సుప్రీంకోర్టు మంగళవారం నిర్దోషిగా ప్రకటించడంపై బుధవారం ఆయన స్పందించారు. ‘సనప్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం కూడా మాకు తెలీదు. కానీ.. ఏం చేద్దాం..? ఈ విషయాన్ని ఆ భగవంతుడికే వదిలేస్తున్నా. ఏం జరిగినా నా కుమార్తెను తీసుకురాలేను’ అనిఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు, ప్రత్యేక మహిళా కోర్టు సన్‌పను దోషిగా నిర్ధారించాయని, దీన్ని బాంబే హైకోర్టు కూడా సమర్థించిందని చెప్పారు. అయితే సుప్రీంకోర్టులో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. ‘ఇది పదేళ్ల కిందటి మాట.. అప్పట్లో కొంత న్యాయం జరిగిందని భావించాం. ఇప్పుడది పూర్తిగా మారిపోయింది. పదేళ్ల కిందట నేను ముంబైలో అనుభవించిన బాధాకరమైన రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి’ అని అన్నారు. ముంబై పోలీసుల పనితీరును అభినందించిన ప్రసాద్.. కేసు విచారణలో భాగంగా సనప్ ఇంట్లో అనూహ్య ఐడీ కార్డు, ఇతర వస్తువులను కూడా గుర్తించారని.. ప్రత్యక్ష సాక్షులు లేకపోయినా.. పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి సరైన వ్యక్తినే పట్టుకున్నారని చెప్పారు. ప్రస్తుతం తన వయస్సు 70 ఏళ్లని, తన భార్యకు కూడా ఆరోగ్యం సహకరించడం లేదని, చివరి రోజుల్లో ప్రశాంతంగా గడపాలనుకుంటున్నామని చెప్పారు. ఇకపై కేసుని కొనసాగించాలని భావించడం లేదని స్పష్టం చేశారు. 23 ఏళ్ల అనూహ్య 2015లో ముంబైలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. సన్‌పపై ముంబై పోలీసులు అత్యాచారం, హత్య ఆరోపణలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 2015లోనే ప్రత్యేక కోర్టు అతడికి మరణ శిక్ష విధించగా.. బాంబే హైకోర్టు సమర్థించింది. దీంతో సనప్ సుప్రీంను ఆశ్రయించాడు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం..
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
For AndhraPradesh News And Telugu News