Share News

ఉద్యోగమే లక్ష్యంగా...

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:41 PM

పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా అభ్యర్థులు కష్టపడుతున్నారు.

ఉద్యోగమే లక్ష్యంగా...
వంద మీటర్ల పరుగును పరిశీలిస్తున్న ఎస్పీ జి. బిందుమాధవ్‌

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

ఆరో రోజు 241 మంది అర్హులు

కర్నూలు క్రైం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా అభ్యర్థులు కష్టపడుతున్నారు. కర్నూలు నగరంలోని ఏపీఎస్పీ బెటాలియనలో సోమవారం ఆరో రోజు పోలీసు కానిస్టేబు ళ్ల అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగాయి. ఈ పరీక్షలకు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌ హాజరై పర్యవేక్షించారు. 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 332 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హాజరయ్యారు. వీరికి సర్టిఫికెట్ల వెరిఫికేషన తర్వాత ఎత్తు, చాతి ఫిజికల్‌ కొలతలు నిర్వహించారు. అనంతరం వీరికి నిర్వహించిన ఫిజకల్‌ ఎఫిషియన్సీ టెస్టులు 1.600 మీటర్ల పరుగు పరీక్షలో 269 మంది అర్హత సాధించారు. 100 మీటర్ల పరుగులో 175 మంది అర్హత సాధించగా లాంగ్‌జం్‌పలో 232 మంది అర్హత పొందారు. కానిస్టేబుల్‌ మెయిన్స పరీక్షకు 6వ రోజు 241 మంది అర్హత సాధించారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు క మాండెంట్‌ సదరన రీజియన మహేష్‌ కుమార్‌, అడిషినల్‌ ఎస్పీ అడ్మిన జి.హుశేన పీరా, ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ కృష్ణమోహన, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, డీపీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:41 PM