Share News

Irrigation Funding AP: ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణకు జైకా నిధులు

ABN , Publish Date - May 16 , 2025 | 03:23 AM

ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు జపాన్‌ జైకా సంస్థ ఆర్థిక సహాయం అందించనున్నది. జలవనరుల శాఖ ముఖ్యాధికారులు, జపాన్‌ వాటర్‌ ఏజెన్సీతో సమావేశమై సహకార అంశాలపై చర్చించారు.

Irrigation Funding AP: ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణకు జైకా నిధులు

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణ కోసం జపాన్‌ ఇంటర్నేషల్‌ కార్పొరేషన్‌ ఏజెన్సీ (జైకా) ఆర్థిక సహాయాన్ని తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో గురువారం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌తో జపాన్‌ వాటర్‌ ఏజెన్సీ(జేడబ్ల్యూఏ) బృందం సమావేశమైంది. డ్యాములు, వంతెన పునరుద్ధరణలో తమకు ఉన్న నైపుణ్యాలను గురించి సాయిప్రసాద్‌కు ఈ బృందం వివరించింది. ‘బ్యారేజీలు, రిజర్వాయర్లు, బ్రిడ్జిల పటిష్ఠతపై అధ్యయనం చేస్తాం. ఇరిగేషన్‌ కట్టడాలను పునరుద్ధరించడంపై నివేదికలనూ ఇస్తాం. ఈ నెలలోనే మేం కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను అధ్యయనం చేశాం. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం 2,59,000 చ.కిలోమీటర్లు ఉంది. ఇది జపాన్‌ భూభాగంలో 70 శాతం. వరల్డ్‌ బ్యాంకు, జపాన్‌ ఇంటర్నేషల్‌ కార్పొరేషన్‌ ఏజెన్సీ ద్వారా సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు తోడ్పడతాం’ అని జేడబ్ల్యూఏ బృందం వివరించింది. డ్రిప్‌ పథకం కోసమూ జైకా ఆర్థిక సహాయాన్ని తీసుకోవచ్చన్న అభిప్రాయాన్ని సాయిప్రసాద్‌ వ్యక్తం చేశారు.

Updated Date - May 16 , 2025 | 03:24 AM