జేఈఈ-మెయిన ఆనలైన ప్రవేశ పరీక్ష ఆరంభం
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:18 AM
దేశ వ్యాప్తంగా జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్, బీఆర్క్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-మెయిన్స ఆనలైన పరీక్ష బుధవారం ప్రారంభమైంది.
కర్నూలు ఎడ్యుకేషన, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్, బీఆర్క్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-మెయిన్స ఆనలైన పరీక్ష బుధవారం ప్రారంభమైంది. ఈ పరీక్ష ఈ నెల 30వ తేదీ వరకు రెండు సెషన్సలో కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆనలైన ప్రవేశ పరీక్ష జరిగింది. కర్నూలు నంద్యాల రోడ్డులోని సనతనగర్‌లో ఉన్న అయాన డిజిటల్ సెంటర్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షా సమయం కంటే రెండు గంటల ముందే కేంద్రానికి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, బంధువులు చేరుకున్నారు. నిర్వాహకులు మెయిన గేటు వద్ద విద్యార్థులు చెక్ చేసి పరీక్ష కేంద్రం లోనికి అనుమతించారు. విద్యార్థుల సౌకర్యార్థం సెల్‌ఫోన్లను, బ్యాగ్‌లను డిపాజిట్ చేసుకునేందుకు లాకర్లను ఏర్పాటు చేశారు.