Share News

‘జల్‌’ జీవం

ABN , Publish Date - Feb 02 , 2025 | 01:13 AM

జల్‌ జీవన్‌ మిషన్‌(జేజేఎం) పథకాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటన ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లోని మంచినీటి ప్రాజెక్టులకు జీవం పోసింది. దాహార్తితో అల్లాడుతున్న ప్రజల గొంతు తడవనుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న జేజేఎం పనులను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు సాగర్‌, పులిచింతల నుంచి ఎన్టీఆర్‌ జిల్లాకు, ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణాజిల్లాకు రక్షిత మంచినీటిని అందించేం దుకు అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో తలసరి నీటి వినియోగం పెంపు దిశగా అడుగులు పడనున్నాయి. కేంద్ర బడ్జెట్‌ చిరువ్యాపారులకు ఊతం, ఎంఎస్‌ఎంఈ రంగాలకు ప్రోత్సాహం, వేతన జీవులకు ఊరటనిచ్చింది. జీజీహెచ్‌, మచిలీపట్నం జనరల్‌ ఆస్పత్రికి డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు రాబోతుండటం శుభపరిణామం. కేంద్ర బడ్జెట్‌పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

‘జల్‌’ జీవం

- ఉమ్మడి కృష్ణాజిల్లాకు ఊతమిచ్చిన కేంద్ర ఆర్థిక బడ్జెట్‌

- ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో శాశ్వత తాగునీటి పథకాల ఏర్పాటుకు దోహదం

- సాగర్‌, పులిచింతల నుంచి ఎన్టీఆర్‌ జిల్లాకు, ప్రకాశం బ్యారేజీ నుంచి మచిలీపట్నానికి తాగునీరు

- శాశ్వత ప్రాతిపదికన మంచినీటి ప్రాజెక్టులకు మోక్షం

- చిరువ్యాపారులకు ఊతం.. ఎంఎస్‌ఎంఈ రంగాలకు ప్రోత్సాహం

- విజయవాడ, మచిలీపట్నం జీజీహెచ్‌లకు డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు

జల్‌ జీవన్‌ మిషన్‌(జేజేఎం) పథకాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటన ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లోని మంచినీటి ప్రాజెక్టులకు జీవం పోసింది. దాహార్తితో అల్లాడుతున్న ప్రజల గొంతు తడవనుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న జేజేఎం పనులను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు సాగర్‌, పులిచింతల నుంచి ఎన్టీఆర్‌ జిల్లాకు, ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణాజిల్లాకు రక్షిత మంచినీటిని అందించేం దుకు అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో తలసరి నీటి వినియోగం పెంపు దిశగా అడుగులు పడనున్నాయి. కేంద్ర బడ్జెట్‌ చిరువ్యాపారులకు ఊతం, ఎంఎస్‌ఎంఈ రంగాలకు ప్రోత్సాహం, వేతన జీవులకు ఊరటనిచ్చింది. జీజీహెచ్‌, మచిలీపట్నం జనరల్‌ ఆస్పత్రికి డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు రాబోతుండటం శుభపరిణామం. కేంద్ర బడ్జెట్‌పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పథకాన్ని మరో మూడు సంవత్సరాలు కొనసాగించ నుండటంతో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో రక్షిత మంచినీటి పథకాల పరంపర కొనసాగనుంది. ఉమ్మడి జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.300 కోట్ల మేర పనులకు శ్రీకారం చుట్టగా, కేంద్రం 50 శాతం మేర మ్యాచింగ్‌ గ్రాంట్‌ను అందిస్తోంది. కిందటి వైసీపీ ప్రభుత్వంలో ఈ పథకాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడంతో వైసీపీ ప్రభుత్వంలో పనుల్లో పురోగతి కొరవడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు సంబంధించి బ్యాలెన్స్‌ పనుల పురోగతిపై దృష్టి సారించడంతో పాటు కొత్త డీపీఆర్‌ల తయారీకి శ్రీకారం చుడుతున్న దశలో జేజేఎం పథకాన్ని పొడిగించడం ఉమ్మడి కృష్ణాజిల్లాకు వరంగా మారింది. కేంద్ర మ్యాచింగ్‌ గ్రాంట్‌ పనులకు సంబంధించిన జేజేఎంలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 1,540 పనులకు, కృష్ణాజిల్లాలో 1,620 పనులకు రూ.1200 కోట్ల వ్యయంతో డీపీఆర్‌లను తయారు చేశారు. తొలి దశలో ఎన్టీఆర్‌ జిల్లాలో 465 పనులకు రూ.150 కోట్ల వ్యయంతో, కృష్ణాజిల్లాలో 515 పనులకు రూ.170 కోట్లు కలిపి రూ.320 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఇప్పటి వరకు కేవలం రూ.68 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కృష్ణాజిల్లాలో రూ.70 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఎన్టీఆర్‌జిల్లా, కృష్ణాజిల్లాల చెంతనే కృష్ణానది ఉన్నా నూరు శాతం రక్షిత మంచినీటిని అందించలేని దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పనులను పట్టాలెక్కించేందుకు డీపీఆర్‌ రూపకల్పన దిశగా అడుగులు పడ్డాయి. ఎన్టీఆర్‌ జిల్లాకు సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటిని సంగ్రహించటం ద్వారా తలసరి నీటి వినియోగాన్ని పెంచాలని భావించి డీపీఆర్‌ తయారు చేస్తున్నారు. కృష్ణాజిల్లాకు ప్రకాశం బ్యారేజీ నుంచి మంచి నీటిని తీసుకువెళ్లేందుకు వీలుగా డీపీఆర్‌ రూపకల్పన దిశగా అడుగులు వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో జల్‌జీవన్‌ మిషన్‌ను 2028 వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల ఉమ్మడి కృష్ణాజిల్లా వాసుల తాగునీటి అవసరాలు తీరడంతో పాటు, విస్తృతమైన వాటర్‌ నెట్‌వర్క్‌ ఏర్పడటానికి అవకాశాలు కలగనున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని ఏ.కొండూరు, గంపలగూడెం మండలాల పరిధిలో కిడ్నీ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసే ప్రాజెక్టులకు అవకాశం ఏర్పడింది.

- ఎంఎస్‌ఎంఈ రంగం ఖుషి

ఉమ్మడి జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కరోనా తదనంతర పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలు మనుగడ సాఽధించాలంటే పెట్టుబడి అవసరమ వుతోంది. పెట్టుబడి ప్రోత్సాహకాలను ఈ రంగం గత మూడేళ్లుగా కోరుతోంది. ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలను రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేరకు పెంపుదల చేయటంపై ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రధానంగా ఐటీ స్టార్టప్స్‌ వంటివి గత కొన్నేళ్లుగా ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణాజిల్లాలో కమ్యూనికేషన్స్‌, తయారీ రంగాలకు చెందిన స్టార్టప్స్‌ ఎక్కువుగా ఏర్పాటవుతున్నాయి. స్టార్టప్స్‌ కూడా రూ.10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాల పెంపు పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

- క్యాన్సర్‌ బాధితులకు ఊరట

జీవన విధానం మారడంతో రోజురోజుకు క్యాన్సర్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. క్యాన్సర్‌పై సరైన అవగాహన లేకపోవడం, ఖరీదైన పరీక్షలు చేయించుకోవాల్సి రావడం వల్ల ముందస్తుగా తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయడంలేదు. దీంతో ఎంతో మంది మూడు, నాలుగో స్టేజికి చేరుకునే వరకు తెలుసుకోలేక చనిపోతున్నారు. క్యాన్సర్‌ మహమ్మారిని జయించేందుకు అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు ఏర్పాటు చేయడానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వటం వల్ల పేదలకు అందుబాటులోకి క్యాన్సర్‌ వైద్యం రాబోతోంది. విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రిలో కానీ, కృష్ణాజిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో కానీ క్యాన్సర్‌కు సంబంధించిన వైద్య సేవల విభాగాలు లేవు. కేంద్రం నిర్ణయం వల్ల రెండు జిల్లాల ఆస్పత్రుల్లో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. దీని వల్ల తొలి దశలోనే క్యాన్సర్లను గుర్తించడంతో పాటు విస్తృత అవగాహన కల్పించడానికి దోహదపడుతుంది.

మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం కొత్త ఆలోచన

మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చేయనట్టుగా కనిపిస్తున్నప్పటికీ.. ఈ సారి కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో కేటాయింపులు జరిపిన వాటికి సంబంధించి బడ్జెట్‌ వినియోగం జరగకపోవటం వల్ల అవి మురిగిపోతున్నాయి. ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ సారి అలా కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆమోదిత ప్రాజెక్టులకు ఆటోమేటిక్‌గా బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిధులు కేటాయింపు ఆలోచనను కేంద్రం చేసినట్టుగా తెలుస్తోంది. విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు విషయానికి వస్తే.. ఈ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించాల్సి ఉంది. అందువల్ల ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదు. గతంలో మెట్రో ప్రాజెక్టు కోసం కేటాయించిన కేటాయింపులు ఖర్చు కాకపోవటంతో అవి మురిగిపోయాయి.

అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్‌

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంది. రైతులకు మేలు చేసే ప్రధాన మంత్రి ధాన్య కల్యాణ యోజన రాష్ర్టాల భాగస్వామ్యంలో ఏర్పాటు చేసే ఆలోచన బాగుంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రైతులకు పంట రుణాలు రూ.3లక్షల నుంచి 5లక్షల వరకు పెంచడంతో రైతులకు ప్రయోజనం కలుగుతుంది. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం పనులను పూర్తి చేయడానికి 2028 వరకు గడువు పెంచడం రాష్ర్టానికి మేలు చేస్తుంది.

-ఎంపీ వల్లభనేని బాలశౌరి

Updated Date - Feb 02 , 2025 | 01:13 AM