Jagan: చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టా
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:12 AM
అప్పట్లో కరెంటు చార్జీలను చంద్రబాబు విపరీతంగా పెంచిన నేపథ్యంలో బాబు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెట్టాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా.. టీడీపీ అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి సపోర్టు చేసింది...
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి టీడీపీ సపోర్టు చేసింది!!
జగన్ మాటలతో విస్తుపోయిన వైసీపీ నేతలు
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ‘అప్పట్లో కరెంటు చార్జీలను చంద్రబాబు విపరీతంగా పెంచిన నేపథ్యంలో బాబు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెట్టాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా.. టీడీపీ అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి సపోర్టు చేసింది. 294 స్థానాలకు 148 ఎమ్మెల్యే స్థానాలు హాఫ్ వే మార్కు అయితే.. అప్పట్లో చంద్రబాబు పార్టీ సపోర్టు చేయడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి గట్టెక్కారు. బాబు, కాంగ్రెస్ ఇద్దరూ కుమ్మక్కయ్యారు’ అని జగన్ పేర్కొన్నారు. ఆ మాటలు విని యువజన విభాగం నేతలు విస్తుపోయారు. ‘జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమేంటి? 2011లో అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ కదా అవిశ్వా సం పెట్టింది.. జగన్‌తో ఉన్న 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ తీర్మానానికి మద్దతిచ్చారు. ఆ తీర్మానం ఓడిపోయింది. పైగా... కాంగ్రెస్ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు విద్యుత్ చార్జీలు పెంచడం ఏమిటి’ అని జుత్తుపీక్కున్నారు. అయితే ఆర్గనైజేషన్‌లో ఉన్నప్పుడు బుర్ర ఉండాలన్న జగన్ గీతోపదేశం గుర్తుకొచ్చి చప్పట్లు కొట్టారు.