SIT Investigation: సిట్ వలలో జగన్ బంధువు
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:39 AM
మద్యం స్కాం కేసు విచారణలో సిట్ అధికారులు వేగం పెంచారు. శుక్రవారం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో మాజీ సీఎం జగన్ బంధువు సందీప్‌రెడ్డికి...
సందీప్‌రెడ్డిని ప్రశ్నించిన అధికారులు
తెలంగాణలోని కంపెనీలో 8గంటలు సోదాలు
విలువైన పత్రాలు, కంప్యూటర్ డేటా స్వాధీనం
సంగారెడ్డి రూరల్, విశాఖపట్నం,సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మద్యం స్కాం కేసు విచారణలో సిట్ అధికారులు వేగం పెంచారు. శుక్రవారం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో మాజీ సీఎం జగన్ బంధువు సందీప్‌రెడ్డికి చెందిన కంపెనీలో సోదాలు జరిపారు. విజయవాడకు చెందిన పది మంది సిట్ అధికారుల బృందం .. సందీప్‌రెడ్డి నిర్వహణలోని గ్రీన్‌టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్దకు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో చేరుకుంది. సోదాలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. ఇదే సమయంలో మరో బృందం సందీప్‌రెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే, సందీప్‌రెడ్డి కొన్ని ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. కంపెనీ సిబ్బందిని కూడా వేరు వేరుగా ప్రశ్నిస్తూ వారి స్టేట్‌మెంట్లను నమోదుచేశారు. అనంతరం కార్యాలయం నుంచి పలు విలువైన పత్రాలు, బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్లు, ప్రాజెక్టు ఒప్పందాలు, ఇన్‌కం ట్యాక్స్ ఫైలింగ్‌లు, డిజిటల్ డేటాను సిట్ అధికారులు తమ వెంట తీసుకువెళ్లినట్టు సమాచారం.