Jagan Refuses Assembly Attendance: అసెంబ్లీకి నేను రాను
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:58 AM
ఫేక్ ప్రచారం చేయడం కాదు! దమ్ముంటే అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు..
నాకు ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే వస్తాం: జగన్
అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘ఫేక్ ప్రచారం చేయడం కాదు! దమ్ముంటే అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా!’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విసిరిన సవాల్‌కు వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. సభకు వచ్చేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. తనకు ప్రతిపక్షనేత హోదా కట్టబెడుతున్నట్లుగా స్పీకర్‌కు ప్రభుత్వం లేఖ అందించి... ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ పులివెందుల పర్యటనలో తన సన్నిహితులు, బంధువుల వద్ద జగన్ తేల్చి చెప్పినట్లు తెలిసింది. తమకు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ, ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానని జగన్ మొండికేయడం గమనార్హం.
ఆ హోదా ఇస్తేనే శాసనసభకు జగన్: సజ్జల
జగన్‌కు ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే శాసనసభా సమావేశాల్లో పాల్గొంటామని వైసీసీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి తామెంచుకున్న మీడియా ప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడారు. ‘జగన్‌కు ప్రతిపక్షనేత హోదా ఇచ్చే దమ్ము చంద్రబాబు ప్రభుత్వానికి ఉందా?’ అంటూ సవాల్ విసిరారు.