జగన్‌ను నమ్ముకుంటే జైలుకే: మాణిక్యాలరావు
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:46 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్‌రెడ్డికి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై నమ్మకం లేదు అని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఆరోప్శించారు.
అమకావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ అధ్యక్షుడు జగన్‌రెడ్డికి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై నమ్మకం లేదు’ అని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఆరోప్శించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈవీఎంలు ధ్వంసం చేసే వారిని, కోర్టు ఫైళ్లు తగులబెట్టే వారిని, హత్య చేసి డోర్‌డెలివరీ చేసే వారిని జగన్ హీరోలను చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జగన్‌ను నమ్ముకుని తప్పులు చేసిన నందిగం సురేశ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వంశీ లాంటి వారంతా జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తున్నారు. జగన్ కూడా జైలుకు వెళ్లడం ఖాయం’ అన్నారు.