Share News

YS Jagan: ఇది బాబు సృష్టించిన విపత్తు

ABN , Publish Date - Oct 31 , 2025 | 04:49 AM

మొంథా తుఫాన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన విపత్తు అంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వింత వ్యాఖ్యానం చేశారు.

YS Jagan: ఇది బాబు సృష్టించిన విపత్తు

  • గత 16 నెలల్లో రాష్ట్రానికి 16 తుఫాన్లు

  • ఒక్క రైతుకూ నష్టపరిహారం ఇవ్వలేదు

  • పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్‌ వింత వ్యాఖ్యలు

అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన విపత్తు అంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వింత వ్యాఖ్యానం చేశారు. ఉచిత పంటల బీమాను తన ప్రభుత్వం గొప్పగా అమలుచేయగా, చంద్రబాబు దానిని నిర్వీర్యం చేశారన్నారు. గడచిన 16నెలల్లో 16సార్లు తుఫాన్లు వస్తే రైతులకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆపార్టీ జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అరకొర లెక్కల ప్రకారమే గడచిన విపత్తులకు చెల్లించాల్సి పంటనష్ట పరిహారం రూ.600కోట్లను ప్రభుత్వం ఎగ్గొట్టిందని విమర్శించారు. ‘‘మిర్చిక్వింటాలు రూ.11,781కు కొంటామని, మామిడి కిలో రూ.12 చొప్పున తీసుకుంటామని, ఉల్లి క్వింటాలు రూ.1900కు కొనుగోలుచేస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారు’’ అని ఆరోపించారు. కాగా, మెడికల్‌ కాలేజీల అంశంలో తలపెట్టిన నిరసనను వచ్చే నెల 4నుంచి 11వతేదీకి వాయిదా వేసినట్టు తెలిపారు. జిల్లాల్లో ఎప్పుడు పర్యటిస్తారని కొందరు ప్రశ్నించగా, ప్రభుత్వం పంటనష్టం లెక్కలువేసి రైతులకు చెల్లింపులు జరిపాక, పరిస్థితినిబట్టి పర్యటనకు వస్తానని జగన్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మొంథా తుపాన్ ఎఫెక్ట్.. 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం..

ఇన్సురెన్స్ డబ్బుల కోసం తల్లి దారుణం.. లవర్‌తో కలిసి కొడుకు మర్డర్..

Updated Date - Oct 31 , 2025 | 07:16 AM