Share News

పిచ్చోడు జగన్‌.. మళ్లీ చెలరేగిపోతున్నాడు: అచ్చెన్న

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:28 AM

ఓ పిచ్చోడికి అధికారం ఇస్తే ఏలా ఉంటుందో 2019-24 మధ్య చూశాం. జగన్‌ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చేశాడు అని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.

పిచ్చోడు జగన్‌.. మళ్లీ చెలరేగిపోతున్నాడు: అచ్చెన్న

అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘ఓ పిచ్చోడికి అధికారం ఇస్తే ఏలా ఉంటుందో 2019-24 మధ్య చూశాం. జగన్‌ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చేశాడు’ అని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మరోసారి ఆ పిచ్చోడు చెలరేగిపోతున్నాడు. ప్రతిపక్ష హోదా కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడు. అది ప్రభుత్వమో, టీడీపీనో ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. ఈ విషయాన్ని ఆ పిచ్చోడికి అర్థమయ్యేలా చెప్పేవారే వైసీపీలో లేకుండాపోయారు’ అని మండిపడ్డారు.

మరో 24,894 టన్నుల యూరియా కేటాయింపు

రాష్ట్రానికి మరో 24,894 టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈనెల 15-22 తేదీల మధ్య విశాఖపట్నం పోర్టుకు యూరియా వస్తుందన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 05:30 AM