Share News

ఐటీడీఏ పీవోగా రాములు నాయక్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:16 AM

కోటరామచంద్ర పురం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు ఆఫీసర్‌, ఆర్‌ అండ్‌ ఆర్‌ ఆఫీసర్‌గా కె.రాములు నాయక్‌ శుక్రవారం బాధ్య తలు స్వీకరించారు.

ఐటీడీఏ పీవోగా  రాములు నాయక్‌ బాధ్యతల స్వీకరణ

బుట్టాయగూడెం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కోటరామచంద్ర పురం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు ఆఫీసర్‌, ఆర్‌ అండ్‌ ఆర్‌ ఆఫీసర్‌గా కె.రాములు నాయక్‌ శుక్రవారం బాధ్య తలు స్వీకరించారు. సుమారు ఆరు నెలలు తర్వాత ప్రభుత్వం ఐటీడీఏకు పూర్తిస్థాయి అధికారిగా ఈయనను నియమించింది. గతంలో పీవోగా పనిచేసిన ఎం.సూర్యతేజ గతేడాది జూలై 23న ఇక్కడ నుంచి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఎస్డీసీ జె.శ్రీనుకుమార్‌, జేసీ పి.ధాత్రిరెడ్డి ఇన్‌చార్జీ పీవోలుగా పనిచేశారు. గతంలో రాములు నాయక్‌ ఏలూరులో విజిలెన్స్‌ ఎస్డీసీగా పనిచేశారు.

Updated Date - Jan 18 , 2025 | 12:16 AM