Share News

సీఎంను కలిసిన ఇస్రో శాస్త్రవేత్త

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:39 AM

ఇస్రో ఇటీవల నిర్వహించిన పరీక్షలో అఖిల భారత స్థాయిలో 9వ ర్యాంకు సాధించి, శాస్త్రవేత్తగా ఎంపికైన తెలుగు యువకుడు జడగం రమేష్‌ గురువారం సచివాలయంలో సీఎం

సీఎంను కలిసిన ఇస్రో శాస్త్రవేత్త

అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఇస్రో ఇటీవల నిర్వహించిన పరీక్షలో అఖిల భారత స్థాయిలో 9వ ర్యాంకు సాధించి, శాస్త్రవేత్తగా ఎంపికైన తెలుగు యువకుడు జడగం రమేష్‌ గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. తండ్రి శ్రీనివాసులు డ్రైవర్‌గా, తల్లి రామలక్ష్మి టైలర్‌గా పనిచేస్తూ కష్టపడి రమే్‌షను చదివించారని తెలుసుకున్న సీఎం.. ఈ సందర్భంగా వారిని అభినందించారు. చంద్రయాన్‌-3 ల్యాండర్‌ మిషన్‌ బృందంలో ఒకరిగా పనిచేసిన రమేష్‌.. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఐఎ్‌ఫఎస్‌ రమేశ్‌ మృతిపై బాబు సంతాపం

సీనియర్‌ ఐఎ్‌ఫఎస్‌ అధికారి రమేశ్‌కుమార్‌ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. శిక్షణ నిమిత్తం లక్షద్వీప్‌ వెళ్లిన రమేశ్‌ గుండెపోటుతో మరణించారు. దీనిపై లక్షద్వీ్‌పలోనే ఉన్న పీసీసీఎఫ్‌ చిరంజీవ్‌ చౌదరితో సీఎం మాట్లాడారు. ప్రత్యేక విమానంలో భౌతిక కాయాన్ని తెప్పించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jan 17 , 2025 | 04:39 AM