Share News

ISRO: వంద’కు ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:49 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలో వందో ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ నెల 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌15 రాకెట్‌ ప్రయోగం చేపట్టనుంది.

ISRO: వంద’కు ముహూర్తం ఖరారు

29న శ్రీహరికోటలో వందో రాకెట్‌ ప్రయోగం

జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌15 రాకెట్‌లో నింగిలోకి ఎన్‌వీఎ్‌స-02

సూళ్లూరుపేట, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలో వందో ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ నెల 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌15 రాకెట్‌ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్‌ ద్వారా దేశ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (నావిక్‌)లో భాగమైన ఎన్‌వీఎ్‌స-02 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్దనున్న వ్యాబ్‌లో మూడు దశల అనుంధాన ప్రక్రియను పూర్తిచేసిన శాస్త్రవేత్తలు రాకెట్‌ను ప్రయోగ వేదికకు తరలించారు. శిఖర భాగాన ఉన్న ఎన్‌వీఎ్‌స-02 ఉపగ్రహాన్ని ఉష్ణకవచంలో అమర్చే ప్రక్రియను కూడా పూర్తిచేసి ప్రయోగానికి సిద్ధం చేశారు. శ్రీహరికోటలో ఇస్రోకిది వందో రాకెట్‌ ప్రయోగం కావడంతో షార్‌లో వివిధ కార్యక్రమాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నావిక్‌ అనేది స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్‌ ఉపగ్రమ వ్యవస్థ. ఇది భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది. భారత భూభాగం వెలుపల కూడా 1500 కి.మీ. వరకూ కచ్చితమైన సమాచారాన్ని వేగంగా అందిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..

Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..

Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట

Updated Date - Jan 25 , 2025 | 04:49 AM