డిపో నిర్వహణ ఇలాగేనా?
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:09 AM
రేషన్ డిపోని ఇలాగేనా నిర్వహించేదని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాతపట్నం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రేషన్ డిపోని ఇలాగేనా నిర్వహించేదని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీసీసీ పరిధిలోని రేషన్ దుకాణాన్ని గురువారం ఆక స్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టాకుకు, రికార్డుల్లో వ్యత్యాసం ఉండడంపై నిర్వాహకురాలు సీహెచ్ పాపమ్మను ప్రశ్నిం చారు. ఎండీ యూ ఆపరేర్ బాలకృష్ణను పిలి పించి ఇళ్లవద్దకు సరుకులను సకాలంలో అంది స్తున్నారా అని ప్రశ్నించారు. స్టాకు, రిజిస్టర్లలో తేడాలపై షోకాజ్ నోటీసివ్వాలని అధికా రులను ఆదేశించారు. స్థానిక కేజీబీవీని సందర్శించి తనిఖీ చేశారు. స్టోర్‌రూం నిర్వా హణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ఇటువంటి వాడి పోయిన కూరగాయలు వండిపె డతారా అని ప్రశ్నించారు. తక్షణం కూరగాయల సరఫరాదారుకు షోకా జ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశిం చారు. విద్యార్థి నులతో మాట్లాడి సహపంక్తి భోజ నం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ ఎస్.కిరణ్‌కుమార్, ప్రభు త్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎస్. వైకుంఠరావు, పలువురు సిబ్బంది తదితరులు ఉన్నారు.
చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు
హరిపురం, ఫిబ్రవరి6 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని, అధైర్యపడొద్దని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. రాధాకృష్ణ పురంలో రైస్‌మిల్లులను ఆయన రెవెన్యూ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి మిల్లు తమ లక్ష్యాల మేరకు బ్యాంకు గ్యారెంటీ సిద్ధం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు ఆర్డీవో జి.వెంకటేష్, తహసీల్దార్ హైమావతి తదితరులు పాల్గొన్నారు.