Share News

PSR Anjaneyulu: బెయిల్‌ మంజూరు చేయండి

ABN , Publish Date - May 14 , 2025 | 05:38 AM

ముంబై నటి జెత్వానీ కేసులో బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, తాను దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇక, ఏపీపీఎస్సీ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.

PSR Anjaneyulu: బెయిల్‌ మంజూరు చేయండి

హైకోర్టును ఆశ్రయించిన పీఎ్‌సఆర్‌

అమరావతి/విజయవాడ, మే 13(ఆంధ్రజ్యోతి): ముంబై నటి జెత్వానీ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసులో సహనిందితులుగా ఉన్న కుక్కల విద్యాసాగర్‌, ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్‌ గున్ని మరికొంద రు బెయిల్‌ పొందారని పేర్కొన్నారు. తనను వేధించడం కోసమే దర్యాప్తునకు సహకరించడం లేదని ఆరోపిస్తున్నారన్నారు. దర్యాప్తునకు సహకరించడాని కి సిద్ధంగా ఉన్నానన్నారు. ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానని, బెయిల్‌ ఇవ్వాలని కోరారు. పీఎ్‌సఆర్‌ ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. విజయవాడ రెండవ అదనపు జిల్లా కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

ఏపీపీఎస్సీ కేసులో రేపటికి వాయిదా

ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను విజయవాడ కోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు పోలీసులను ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 05:38 AM