Share News

మౌలిక వసతులు కల్పించాలి

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:02 AM

పట్టణ శివారు ప్రాంతంలోని పేదలు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ఆ కాలనీ వాసులు, ఆర్సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు

మౌలిక వసతులు కల్పించాలి
ఆందోళన చేస్తున్న కాలనీ వాసులు

కదిరిఅర్బన, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): పట్టణ శివారు ప్రాంతంలోని పేదలు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ఆ కాలనీ వాసులు, ఆర్సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పట్టణంలోని సర్వేనెంబర్‌ 1778-1బిలో గత ప్రభుత్వంలో ఇళ్లు నిర్మించుకున్నామని, నీరు, విద్యుత, రోడ్లు తదితర మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించి, పట్టాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాగన్న, సుగుణమ్మ, స్వప్న, అరుణ్‌, రాజు, వెంకటల క్ష్మమ్మ, నరసమ్మ పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 12:02 AM