Share News

Industrial pollution : పరిశ్రమల కాలుష్యంతో మత్స్యకారుల జీవనోపాధికి గండి

ABN , Publish Date - Jan 31 , 2025 | 06:00 AM

సుమారు వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల కాలుష్యంతో రెండు లక్షల మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయని వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొం

Industrial pollution : పరిశ్రమల కాలుష్యంతో మత్స్యకారుల జీవనోపాధికి గండి

ప్రభుత్వ జోక్యానికి డాక్టర్‌ రాజేంద్ర సింగ్‌ డిమాండ్‌

సీతంపేట (విశాఖపట్నం), జనవరి 30 (ఆంధ్రజ్యోతి): సుమారు వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల కాలుష్యంతో రెండు లక్షల మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయని వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన పర్యావరణవేత్త డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖపట్నంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీర ప్రాంతంలో ఉన్న పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలో కలవడంతో మత్స్య సంపదకు తీవ్రనష్టం కలుగుతోందన్నారు. ఇటీవల ఈ కాలుష్యం కారణంగా సముద్ర తాబేళ్లు (ఆలివ్‌ రిడ్లీ) పెద్దసంఖ్యలో మృత్యువాత పడ్డాయన్నారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ కోరారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.



Also Read-
Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం

Also Read- Spirit: రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్ అప్పుడే

Also Read- Kangana Ranaut: కాజోల్‌, దీపికా ముద్దు.. మేమంటే చేదు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 06:00 AM