తాగునీటి ట్యాంక్ వద్ద అపరిశుభ్రత
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:25 PM
మండలంలోని సోమ యాజులపల్లి పంచాయతీలోని కత్తివారి పల్లి తాగునీటి ట్యాంక్ వద్ద మురుగునీరుతో అపరిశుభ్రత నెలకుంది.

గాండ్లపెంట, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని సోమ యాజులపల్లి పంచాయతీలోని కత్తివారి పల్లి తాగునీటి ట్యాంక్ వద్ద మురుగునీరుతో అపరిశుభ్రత నెలకుంది. ట్యాంక్‌ల వద్ద పంచాయతీ అధికారులు మురుగునీరు నిలువ లేకుండా ఉండేలా చూడాల్సి ఉంది. అయితే పంచాయతీ అధికారులు పట్టిం చుకోకపోవడంతో మురుగునీరు నిలువ ఉండడంతో అపరిశుభత్ర నెలకుంది. దీంతో తాగునీరు కలుషితం అవుతోంది. అంతేకాకుండా దోమలు వృద్ధిచెంది ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అలాగే మండల వ్యాప్తంగా పంచాయతీల్లో ట్యాంక్‌లను శుభ్రం చేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నా... పంచాయతీ అధికారులు గాలికి వదిలేశారు.