Share News

అక్రమంగా సిమెంట్‌ అమ్మకాలు

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:47 PM

గుర్రం కొండలో అక్రమంగా సిమెంట్‌ అమ్మకాలు జరు గుతున్నా పట్టించుకునేవారు లేరు.

అక్రమంగా సిమెంట్‌ అమ్మకాలు
అక్రమ సిమెంట్‌ అమ్మకాల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు

కొందరు సిమెంట్‌ ట్యాంకర్ల డ్రైవర్లతో కుమ్మక్కై గుర్రంకొండలో లూజ్‌గా విక్రయిస్తున్న వైనం నష్టపోతున్నామంటున్న వ్యాపారులు

గుర్రంకొండ, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): గుర్రం కొండలో అక్రమంగా సిమెంట్‌ అమ్మకాలు జరు గుతున్నా పట్టించుకునేవారు లేరు. దీంతో తా ము తీవ్రంగా నష్టపోతున్నామంటూ మండలం లోని సిమెంట్‌ వ్యాపారులు లబోదిబోమంటు న్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితంలే దంటూ వాపోతున్నారు. దీనికితోడు సిమెంట్‌ ధరలు అధికంగా ఉండడంతో సామాన్య ప్రజల కు ఇంటి నిర్మాణం కలగా మారింది. దీనికి తోడు ఐరన కమ్మీ, ఇసుక, కూలీల ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో మధ్య, పేదలు సొంతింటి కల నెరవేరడం లేదు. సిమెంట్‌ ఎక్కువ భాగం కడప జిల్లా ఎర్రగుంట్ల నుంచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రగుంట్ల నుంచి ప్రతిరోజు పదుల సంఖ్యలో సిమెంట్‌ ట్యాంకర్లు గుర్రంకొం డ మీదుగా బెంగుళూరుకు వెళుతున్నాయి. ఈ ట్యాంకర్లలోని సిమెంట్‌ను కొంత మంది డ్రైవర్లు అక్కడక్కడ వాహనాలను ఆపి విక్రయిస్తున్నా రు. ట్యాంకర్లలోని సిమెంట్‌ను సంచులకు నింపి మార్కెట్‌ ధరల కంటే రూ.50 నుంచి 80 వర కు తగ్గించి అమ్ముతున్నారు. దీంతో ఈ లూజ్‌ సిమెంట్‌కు గుర్రంకొండ మండలంలో మంచి గిరాకీ ఉంది. ఇదే అదునుగా భావించిన కొంద రు వ్యాపారులు లూజ్‌ సిమెంట్‌ వ్యాపారం నిర్వహిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. గుర్రం కొండ మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ పరిధిలోని సూరప్పగారిపల్లె, కోన క్రాస్‌ వద్ద ఈ లూజ్‌ సిమెంట్‌ వ్యాపారం జోరుగా జరుగు తోంది. ఇందు కోసం వ్యాపారులు సూరప్పగారి పల్లె, కోన క్రాస్‌ వద్ద రేకుల షెడ్లును ఏర్పాటు చేశారు. సిమెంట్‌ ట్యాంకర్లు రాత్రి పూట ఎర్ర గుంట్ల నుంచి బెంగుళూరుకు వెళుతూ మార్గ మధ్యంలోని సూరప్పగారిపల్లె, కోన క్రాస్‌ వద్ద ఉన్న రేకుల షెడ్ల వద్దకు చేరుకొంటాయి. ఓ సిమెంట్‌ ట్యాంకర్‌ నుంచి 50 నుంచి 100 బస్తాల వరకు సిమెంట్‌ను తీసి ఖాళీ సంచులో నింపి అప్పటికప్పుడే తక్కువ ధరలకు విక్రయి స్తున్నారు. ఈ లూజ్‌ సిమెంట్‌ను వ్యాపారులు నిర్మాణదారుల ఇంటి వద్దకే చేరుస్తుండడం కొసమెరుపు. ఇలా ప్రతి రోజు పదుల సంఖ్యలో సిమెంట్‌ ట్యాంకర్లు ద్వారా లూజ్‌ సిమెంట్‌ను వేలాది రూపాయలకు అమ్ముతున్నారు. సుమా రు పది నుంచి 20 లారీల్లో సిమెంట్‌ను లూజ్‌ గా తీసి అమ్మేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ లూజ్‌ సిమెంట్‌ అమ్మకాలను కొందరు వ్యాపా రంగా మలుచుకుని అక్రమార్జన చేస్తున్నారు. కాగా లూజ్‌ సిమెంట్‌ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని పట్టణంలోని సిమెంట్‌ వ్యాపారు లు పోలీసులకు తమ సమస్యలను తెలుపుతూ ఫిర్యాదు చేసిన అటు వైపు వారు కన్నెత్తి చూడ డం లేదని వాపోతున్నారు. దీంతో ఏడాదికి వేలాది రూపాయలు టాక్స్‌లు చెల్లించి వ్యాపా రం చేయడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లూజ్‌ సిమెంట్‌ అమ్మకాలపై

చర్యలు తీసుకొంటాం

అక్రమంగా సిమెంట్‌ అమ్మకాలు చేస్తున్న వ్యాపారులపై నిఘా ఉంచాం. ట్యాంకర్ల నుంచి సిమెంట్‌ తీసి తక్కువ ధరలకు విక్రయిస్తునట్లు ఫిర్యాదులు వచ్చాయి. చెర్లోపల్లెలో లూజ్‌ సిమెంట్‌ వ్యాపారంపై చర్యలు తీసుకొంటాం.

-మదు రామచంద్రుడు, ఎస్‌ఐ, గుర్రంకొండ

Updated Date - Feb 14 , 2025 | 11:47 PM