Share News

Pedireddy : జగన్‌ మళ్లీ సీఎం అయితే.. మా దెబ్బ ఏంటో రుచిచూపిస్తాం

ABN , Publish Date - Jan 31 , 2025 | 05:43 AM

గెలుపోటములు రూపాయి బిళ్లకు ఉండే బొమ్మ బొరుసు లాంటివి. అధికారం అనేది అటూ ఇటూ మారుతుంది. మా పార్టీ వారిపై కేసులు పెట్టిన వారందరినీ గుర్తు పెట్టుకుంటాం. జగన్‌ మళ్లీ సీఎం అయితే మా దెబ్బ ఏంటో రుచి

Pedireddy : జగన్‌ మళ్లీ సీఎం అయితే.. మా దెబ్బ ఏంటో రుచిచూపిస్తాం

రాయచోటి టౌన్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ‘గెలుపోటములు రూపాయి బిళ్లకు ఉండే బొమ్మ బొరుసు లాంటివి. అధికారం అనేది అటూ ఇటూ మారుతుంది. మా పార్టీ వారిపై కేసులు పెట్టిన వారందరినీ గుర్తు పెట్టుకుంటాం. జగన్‌ మళ్లీ సీఎం అయితే మా దెబ్బ ఏంటో రుచి చూపిస్తాం. దాడులకు ప్రతిదాడులు జరుగుతాయ్‌...’ అని వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం రాయచోటిలో అన్నమయ్య జిల్లా వైసీపీ కార్యవర్గ సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ నేతలు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అధోగతిపాలు చేస్తున్నారని ఆరోపించారు. తెచ్చే అప్పులన్నింటినీ రాజధానిలో ఖర్చు పెడుతున్నారన్నారు.



Also Read-
Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం

Also Read- Spirit: రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్ అప్పుడే

Also Read- Kangana Ranaut: కాజోల్‌, దీపికా ముద్దు.. మేమంటే చేదు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 05:43 AM