పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోం
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:47 PM
షరతుల పేరుతో పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నాగేశ్వరరావు హెచ్చరించారు.

నందికొట్కూరు, ఫిబ్రవరి10 (ఆంధ్రజ్యోతి): షరతుల పేరుతో పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నాగేశ్వరరావు హెచ్చరించారు. సోమవారం నందికొట్కూరు సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి పటేల్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అర్హులైన పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాలు ఇచ్చి పక్కా గృహాల నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని ధర్నా చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అనేక షరతులు పెట్టి అమలు చేస్తుందని ఆయన ఆరోపించారు. 300 యూనిట్లు కరెంటు దాటిన వారికి, ఫోర్ వీలర్స్ ఉన్న, భూమి ఉన్న, ఇల్లు పెద్దగా ఉన్న సంక్షేమ పథకాలు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. బతుకుతెరువు కోసం నాలుగు చక్రాల వాహనం, ఆటో తదితర వాహనాలను కొని జీవనం సాగిస్తున్న వారిని అనర్హులుగా ప్రకటించడం బాధాకరమన్నారు. కర్నూలు రోడ్డులోని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నగర్‌లో 2009 నుంచి 300 మంది పేదలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారని, వారికి పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఫక్కీర్ సాహెబ్, గోపాలకృష్ణ, ఎస్.ఉస్మాన, కొంగర వెంకటేశ్వర్లు, సంపంగి వెంకటేశ్వర్లు, దూదేకుల బాబు, తదితరులు పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా:మండలంలోని వివిధ గ్రామాల్లో పేదలకు ఇళ్లస్థలాలు మూడు సెంట్లు ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేసి తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ముట్టడించారు. సీపీఐ నాయకులు రఘురామమూర్తి, శ్రీనివాసులు, రమే్‌షబాబు మాట్లాడుతూ భూకబ్జా చేసిన వారి చేతుల్లో ఉన్న భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. చాబోలు, 80బన్నూరు, కొత్తసిద్ధేశ్వరంలో ఉన్న గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం ఆగదని అన్నారు. అనంతరం ఎంపీడీవో గోపికృష్ణ, తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్‌లకు