Share News

DISCOMs : డిస్కమ్‌లను లాభాల బాట పట్టించడమెలా?

ABN , Publish Date - Jan 31 , 2025 | 06:10 AM

కేంద్ర పథకాలైన సూర్యఘర్‌, పంప్డ్‌స్టోరేజీ జల విద్యుత్‌ ప్లాంట్‌, బ్యాటరీ స్టోరేజీ సామర్థాన్ని వెయ్యి మెగావాట్ల నుంచి 2వేల మెగావాట్లకు పెంచడం, కేంద్రం మంజూరు చేస్తున్న సబ్సిడీలు సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా విద్యుత్‌

DISCOMs : డిస్కమ్‌లను లాభాల బాట పట్టించడమెలా?

ఐదు రాష్ట్రాల విద్యుత్‌ మంత్రులతో గొట్టిపాటి టెలికాన్ఫరెన్స్‌

అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): కేంద్ర పథకాలైన సూర్యఘర్‌, పంప్డ్‌స్టోరేజీ జల విద్యుత్‌ ప్లాంట్‌, బ్యాటరీ స్టోరేజీ సామర్థాన్ని వెయ్యి మెగావాట్ల నుంచి 2వేల మెగావాట్లకు పెంచడం, కేంద్రం మంజూరు చేస్తున్న సబ్సిడీలు సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా విద్యుత్‌ రంగంలోని నష్టాలను తగ్గిస్తూ.. లాభాల బాట పట్టించవచ్చని తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, ఏపీ విద్యుత్‌ మంత్రులు తీర్మానించారు. వెలగపూడి సచివాలయం నుంచి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఐదు రాష్ట్రాల విద్యుత్‌ మంత్రులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జాతీయ స్థాయిలో డిస్కమ్‌లు ఆర్థికంగా తీవ్రనష్టాల్లో కూరుకుపోవడంపై ప్రఽధానంగా చర్చించారు. డిస్కమ్‌లకు రావాల్సిన మొండి బకాయిలను తగ్గించుకోవడం, రాష్ట్రాలు చెల్లించాల్సి బకాయిలు వెంటనే చెల్లించడమే ఉత్తమమార్గమన్న అభిప్రాయానికి వచ్చారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తిని పెంచుకోవడం ద్వారా విద్యుత్‌ కొనుగోలు వ్యయాలను తగ్గించుకోచవ్చని మంత్రులు అభిప్రాయపడ్డారు.



Also Read-
Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం

Also Read- Spirit: రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్ అప్పుడే

Also Read- Kangana Ranaut: కాజోల్‌, దీపికా ముద్దు.. మేమంటే చేదు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 06:10 AM