Share News

పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలి

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:07 AM

మండలంలోని అర్హులైన పేదలకు ఇంటిపట్టాలు మంజూరు చేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసు గు మధు డిమాండ్‌ చేశారు.

పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలి
ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

తాడిమర్రి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని అర్హులైన పేదలకు ఇంటిపట్టాలు మంజూరు చేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసు గు మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆయన ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవా రం ధర్నా చేపట్టారు. మధు మాట్లాడుతూ.... అర్హులకు ఇంటిపట్టాలు ఇవ్వాలని, గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా గృహనిర్మాణాల కోసం రూ.ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. పొలాలకు రహదారులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప, మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, దాసు, రైతు సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కాటమయ్య, నాయకులు పెద్దన్న, వసూరప్ప, రాములు, నాగభూషణ, సూరి పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:07 AM