Share News

ఇంటింటి సర్వే తనిఖీ

ABN , Publish Date - Jan 22 , 2025 | 12:11 AM

పుట్టపర్తి ప్రాథమక ఆరోగ్యకేంద్ర పరిధిలోని పెడపల్లి సుబ్బరాయినిపల్లిలో కుష్ఠు, క్షయ, హెచఎంపీవీ వ్యాధులపై అవగాహన, ఇంటింటి సర్వేను జిల్లా కుష్ఠు నియంత్రణ అధికారి తిప్పయ్య మంగళవారం తనిఖీ చేశారు.

ఇంటింటి సర్వే తనిఖీ
మచ్చలను పరిశీలిస్తున్న జిల్లా కుష్ఠు నియంత్రణ అధికారి తిప్పయ్య

పుట్టపర్తి రూరల్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): పుట్టపర్తి ప్రాథమక ఆరోగ్యకేంద్ర పరిధిలోని పెడపల్లి సుబ్బరాయినిపల్లిలో కుష్ఠు, క్షయ, హెచఎంపీవీ వ్యాధులపై అవగాహన, ఇంటింటి సర్వేను జిల్లా కుష్ఠు నియంత్రణ అధికారి తిప్పయ్య మంగళవారం తనిఖీ చేశారు. ఆయన సిబ్బందితో మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపొహలను తొలగించి వారికి సరైన అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఫిబ్రవరి 2 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. అనంతరం హెచఎంపీవీ వైరస్‌ లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి నగేష్‌, సూపర్‌ వైజర్‌ చంద్రకళ, టీబీ సూపర్‌ వైజర్‌ అబిద్‌బాషా, ఎంఎల్‌హెచపీ సత్యమ్మ ఆరోగ్య అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2025 | 12:11 AM