ఇక పేదోడి ఇంటికి కొత్త కళ
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:30 AM
గత ప్రభుత్వ హయాంలో పేదలందరికీ పక్కా ఇళ్లంటూ తెగ మురిపించి ఊరి చివర లే–అవుట్లలో మమ అనిపించారు. ఇళ్ల నిర్మాణాల కొచ్చేసరికి మూడున్నరేళ్ల పాటు అన్నీ తప్పట డుగులే. ఆఖరికీ పేదల ఇళ్లకు గృహ ప్రవేశాలు జరగకముందే జగన్ జమానా ముగిసింది.

వచ్చే జూన్ నాటికి భారీగా నిర్మాణం
ఈలోపు పూర్తయినఇళ్లు లబ్ధిదారులకు అందజేత
స్థలం ఉండి ఇళ్లు కట్టకపోతే కొత్తగా పట్టాలు
పాత ఇళ్ల పరిస్థితిపై టెన్షన్
(ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
గత ప్రభుత్వ హయాంలో పేదలందరికీ పక్కా ఇళ్లంటూ తెగ మురిపించి ఊరి చివర లే–అవుట్లలో మమ అనిపించారు. ఇళ్ల నిర్మాణాల కొచ్చేసరికి మూడున్నరేళ్ల పాటు అన్నీ తప్పట డుగులే. ఆఖరికీ పేదల ఇళ్లకు గృహ ప్రవేశాలు జరగకముందే జగన్ జమానా ముగిసింది. కూటమి ప్రభు త్వం వచ్చాకా ఈ మధ్యనే తాజాగా పూర్తైన ఇళ్లకు గృహ ప్రవేశాలకు అన్నీ ఏర్పాట్లు చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి వచ్చింది. అయితే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు తక్షణం ఇచ్చేలా చూడాలని తాజాగా ముఖ్యమంత్రి ఆదేశించారు.
అంతా సవ్యంగా జరిగినా..
ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏళ్ల తరబడి జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు సాగాయి. ఒక పద్ధతి పాడు లేకుండా ప్రాధా న్యత ఉన్న ప్రాంతాలను వదిలి వేర్వేరు ప్రాంతా ల్లో నిర్మాణాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2019 తర్వాత జగన్ జమానాలో దాదాపు 750కు పైగా లే–అవుట్లలో 84,393 పైగా ప్లాట్లను వేశారు. వీటిలో కేవలం 75,306 మాత్రమే పట్టాలు ఇచ్చారు. జగన్ హయాంలో జరిగిన జిమ్మిక్కుల్లో భాగంగా ఇళ్లు మంజూరుకు వచ్చేసరికి మళ్లీ దగా చేశారు. కేటాయించిన పట్టాల్లో కేవలం 51,980 ఇళ్లనే నిర్మించేందుకు మంజూరు ఇచ్చారు. ఇక్కడ పట్టాలు, మంజూ రైన గృహల వ్యత్యాసం 23,326గా ఉంది.
కైకలూరులోని జగనన్న మోడల్ కాలనీ మాదిరిగానే ఏలూరుతో సహా మిగతా చోట్ల నిర్మించబోతున్నట్టు ఆనాడు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయి. కూటమి అధికారం లోకి వచ్చాకా ఈ మఽధ్యనే పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారిచేత గృహ ప్రవేశాలను చేసేందుకు వీలుగా మూడు నెలలు పాటు అధికారులను పరుగులు పెట్టించారు. గృహ నిర్మాణశాఖలో సిబ్బంది కొరత వెంటాడుతున్నా ఈనెల ఒకటో తేదీకి గృహ ప్రవేశాలు జరిగేలా ఏర్పాట్లు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వేదికగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆరంభించేం దుకు ఏర్పాట్లు చేశారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజ కవర్గ ఎన్ని కల నోటిఫికేషన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాతే సాఽధ్యమైనంత త్వరగా పేదలకు ఇళ్లను స్వాధీనపరచడానికి సమాయత్తం అవుతున్నారు. తాజాగా వివిధ ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో సీఎం నిర్వ హించిన సమీక్షలో గృహ నిర్మాణశాఖకు సంబం ధించి తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. 2014–19 కాలం లో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల నిర్మాణం పూర్తయితే వాటిని లబ్ధి దారులకు అందించాలని సూచించా రు. ఇదే తరుణంలో వచ్చే 2026 జూన్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని, వాటిని ఒకే రోజు ప్రారంభించేలా ఏర్పాట్లను చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
స్వల్ప వ్యవధిలో సాధ్యమేనా..?
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణం ఇంత స్వల్ప వ్యవధిలో పూర్తి అవుతుందా..? అనే అనుమానం లేకపోలేదు. ఉచిత ఇసుక అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం మిగతా పనులకు పుష్కలంగా నిధులిస్తే ఇది సాధ్యమేనని గృహ నిర్మాణ అఽధికారులు చెబుతున్నారు. 2014–19 మధ్య మంజూరు చేసిన ఇళ్లకు ఆనాటి ప్రభుత్వం నిఽధులు సమకూర్చకుండా మొఖం చాటేసింది. ఫలితంగా వేలాది పేద కుటుంబాలు సొంతింటి కలకు దూరం అయ్యాయి. ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు, వీటిపైనా శ్రద్ధ పెడతామని అధికారులు చెబుతున్నారు. ఇదే తరుణంలో స్థలం కేటాయించి ఇళ్లు కట్టకపోతే ప్రభుత్వ విధానం ప్రకారం పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున అర్హులైన పేదలకు స్థలాలు ఇవ్వాలనే నిర్ణయం అమలు చేయబోతున్నారు. సాఽధ్యమైనంత త్వరగా ప్రజలు మెచ్చేలా ఈ తరహా పనులన్నింటిని పూర్తి చేయాలని భావిస్తున్నారు.