Share News

Hindustan Coca-Cola: పెట్టుబడులకు పూర్వవైభవం

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:07 AM

ఉండవల్లి నివాసంలో బుధవారం ఆ సంస్థ సీఈవో జువాన్‌ పాబ్లో రోడ్రిగ్జ్‌ బృందం మంత్రి నారా లోకేశ్‌ను కలిసింది. కోకాకోలా బృందాన్ని కలవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా లోకేశ్‌ పేర్కొన్నారు.

Hindustan Coca-Cola: పెట్టుబడులకు పూర్వవైభవం

కోకాకోలా పెట్టుబడుల కొనసాగింపే నిదర్శనం.. మంత్రి నారా లోకేశ్‌ వెల్లడి

హెచ్‌సీసీబీ బృందంతో భేటీ.. సిఫీ సీఎండీతోనూ లోకేశ్‌ చర్చలు

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం.. సంసిద్ధత వ్యక్తంచేసిన రాజు వేగేశ్న

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌ (హెచ్‌సీసీబీ) ఆసక్తి చూపింది. ఉండవల్లి నివాసంలో బుధవారం ఆ సంస్థ సీఈవో జువాన్‌ పాబ్లో రోడ్రిగ్జ్‌ బృందం మంత్రి నారా లోకేశ్‌ను కలిసింది. కోకాకోలా బృందాన్ని కలవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా లోకేశ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్వవైభవం వచ్చిందనడానికి హెచ్‌సీసీబీ పెట్టుబడుల కొనసాగింపే నిదర్శనమని చెప్పారు. పారిశ్రామిక హబ్‌గా రాష్ట్రం మారుతోందనడానికి, వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా ఉందనడానికి కోకాకోలా పెట్టుబడులే ఓ ఉదాహరణ అని చెప్పారు. అభివృద్ధి విషయంలో, ఉద్యోగాల కల్పనలో, సామాజిక అభివృద్ధిలో వారి నిబద్ధతను స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే వారి వ్యాపారానికి మద్దతు కొనసాగుతుందని తెలిపారు.


పెట్టుబడులకు సిఫీ ఆసక్తి

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సిఫీ టెక్నాలజీస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజు వేగేశ్నకు మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. ఉండవల్లి నివాసంలో లోకేశ్‌ను రాజు వేగేశ్న కలిశారు. విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్‌, కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కంపెనీ విస్తరణపై లోకేశ్‌ ఆరా తీశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో భాగంగా ప్రభుత్వం అందిస్తోన్న సేవలు, నూతనంగా తీసుకువచ్చిన ఐటీ విధానాలను గురించి లోకేశ్‌ వివరించారు.

jik;l.jpg

ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిఫీ సీఎండీ ఆసక్తిని చూపారు. భవిష్యత్తు ప్రణాళికలను రాజు వేగేశ్న వివరించారు. ఆర్థికాభివృద్ధి బోర్డుతో చర్చించి తదుపరి వాణిజ్య ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన్ను లోకేశ్‌ కోరారు. అనంతరం రాజు వేగేశ్న మాట్లాడుతూ.. దేశంలో టాప్‌ 500 కంపెనీల్లో సిఫీ ఒకటి అన్నారు. దేశంలోని పలు నగరాలు, అనేక కంపెనీలు, బ్యాంకులతో సహా ఉత్తర అమెరికా, ఇంగ్లండ్‌, సింగపూర్‌లోని వివిధ కంపెనీలకు తమ కంపెనీ డేటా సేవలు అందిస్తుందని వివరించారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 04:08 AM