‘నానో’తో అధిక దిగుబడులు
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:11 PM
మండల రైతులు నానో(లిక్విడ్) యూరియా వాడితే అధిక దిగుబడులు సాధ్యమని మండల ప్రత్యేక అధికారి సతీష్‌కుమార్ సూచించారు.
అందుబాటులో కావలసినంత యూరియా : ప్రత్యేక అధికారి సతీష్‌కుమార్
నిమ్మనపల్లి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యో తి): మండల రైతులు నానో(లిక్విడ్) యూరియా వాడితే అధిక దిగుబడులు సాధ్యమని మండల ప్రత్యేక అధికారి సతీష్‌కుమార్ సూచించారు. మంగళవా రం బండ్లపై పంచాయతీలో వరి పైరు కు నానో యూరియాను పిచికారీ చేసే విధానాన్ని పరిశీలించిన ఆయన మాట్లా డుతూ రైతులు ఎక్కువగా నానో(లిక్వి డ్) యూరియా కాకుండా మామూలు యూరియాను వాడడంతో డిమాండ్ పెరిగిందన్నారు. రైతులకు కావల్సినంత యూరియాను పంపిణీ చేస్తున్నట్లు తెలి పారు. నానో(లిక్విడ్) యూరియా తగి నంత నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. నానో యూ రియాపై రైతులకు అవగాహన కల్పించేందుకు వారి మందే పిచికారీ చేసి చూపించారు. యూరియాపై రైతులు అపోహలు చెందవద్దని ప్రతి రైతుకు అంద జేస్తామన్నారు. నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్ర యిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. వ్యవసాయ సహాయకులు, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, ఏఓ తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులో కావలసినంత యూరియా
కలికిరి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో అవసరమైన మేరకు యూరి యాను మంగళవారం నుంచి అందుబాటులో వుం చారు. మొదటి విడతగా మర్రికుంటపల్లె, గుండ్లూరు సచివాలయ పరిధి రైతు సేవా కేంద్రాల్లో మంగళవా రం రైతులకు పంపిణీ చేశారు. ఒక్కో రైతు సేవా కేంద్రంలో 10 టన్నుల వంతున యూరియాను అందుబాటులో వుంచినట్లు ఎంఏఓ హేమలత చెప్పారు.
బుధవారం నుంచి గుట్టపాలెం, కలికిరి-2 ఆర్‌ఎస్కేల్లో 10 టన్నుల వంతున విక్రయాలు చేప డతామన్నారు. గురువారం నుంచి పత్తేగడ, మునేళ్ల పల్లె ఆర్‌ఎస్కేల్లో కూడా పదేసి టన్నుల వంతున స్టాకు అందుబాటులోకి రానుందని ఆమె తెలిపారు. బస్తా యూరియాను రూ.266లకు మాత్రమే విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులందరికీ అవసరమైన మేరకు యూరియాను పంపిణీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం మర్రికుం టపల్లెలో సర్పంచు రెడ్డిరాము, తహసీ ల్దారు హరికుమార్‌తో కలిసి ఆమె యూరియా పంపి ణీని ప్రారంభించారు.
నానో వాడకం పెంచాలి
రైతులు కాలక్రమేణ నానో యూరియా వాడకంపై దృష్టి సారించాలని తహసీలా ్దరు హరికుమార్, ఎంఏఓ హేమలత అన్నారు. మంగళవారం మర్రికుంటపల్లె సచివాలయం వద్ద జరిగిన రైతు అవగాహన సమావేశంలో వారు మాట్లాడుతూ నానో యూరి యా, జీవన ఎరువుల వినియోగంతో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. పంటనుబట్టి అవస రమైన మేరకు యూరియా వాడాలని వివరించారు. మార్కెట్లో అందుబాటులో వున్న నానో యూరియా, నానో డీఏపీలు ఉపయోగిస్తే పంటలకు సమపాళ్ల లో పోషకాలు లభిస్తాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో సర్పంచు రెడ్డిరాము, ఏఈఓ ఇంద్ర, వీఆర్వో సురేష్‌కుమార్ రెడ్డి, ఆర్‌ఎస్కే సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.