Share News

హైటెక్‌ స్పా

ABN , Publish Date - Feb 23 , 2025 | 01:21 AM

భవనం చుట్టూ సీసీ కెమెరాలు. తలుపులు తెరచుకోవడానికి ఆన ఆఫ్‌ స్విచ్‌లు. తలుపుల వద్ద వేలిముద్ర స్కానర్లు. భవనానికి వెళ్లే మార్గానికి రెండు వైపులా సీసీ కెమెరాలు. ఇదేదో నిఘా వ్యవస్థ భవనం, ఇంటెలిజెన్స్‌, ఎస్‌ఐబీ కార్యాలయాలు అనుకుంటే పొరపాటే. ఇది ఉత్తరాది యువతులను ఎరగావేసి నిత్యం రసాంగిక కార్యకలాపాలు సాగించే స్పా సెంటర్‌కు అమర్చిన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉత్తరాది రాషా్ట్రల యువతులతో యథేచ్ఛగా వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నాయి. స్పా సెంటర్‌ బాగోతాన్ని ఓ వ్యక్తి సి్ట్రంగ్‌ ఆపరేషన చేసి ఇచ్చిన సమాచారంతో పోలీసులు బట్టబయలు చేశారు. పది మంది యువతులు, 11 మంది విటులను అరెస్టు చేశారు.

హైటెక్‌ స్పా

మసాజ్‌ ముసుగులో యథేచ్ఛగా వ్యభిచారం

ఉత్తరాది రాషా్ట్రల యువతులతో వ్యాపారం

ఓ వ్యక్తి సి్ట్రంగ్‌ ఆపరేషనలో బయట పడ్డ రాసలీలలు

పది మంది యువతులు, 11 మంది విటుల అరెస్టు

విటుల్లో వైసీపీ నేత శంకర్‌ నాయక్‌

భవనం చుట్టూ సీసీ కెమెరాలు. తలుపులు తెరచుకోవడానికి ఆన ఆఫ్‌ స్విచ్‌లు. తలుపుల వద్ద వేలిముద్ర స్కానర్లు. భవనానికి వెళ్లే మార్గానికి రెండు వైపులా సీసీ కెమెరాలు. ఇదేదో నిఘా వ్యవస్థ భవనం, ఇంటెలిజెన్స్‌, ఎస్‌ఐబీ కార్యాలయాలు అనుకుంటే పొరపాటే. ఇది ఉత్తరాది యువతులను ఎరగావేసి నిత్యం రసాంగిక కార్యకలాపాలు సాగించే స్పా సెంటర్‌కు అమర్చిన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉత్తరాది రాషా్ట్రల యువతులతో యథేచ్ఛగా వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నాయి. స్పా సెంటర్‌ బాగోతాన్ని ఓ వ్యక్తి సి్ట్రంగ్‌ ఆపరేషన చేసి ఇచ్చిన సమాచారంతో పోలీసులు బట్టబయలు చేశారు. పది మంది యువతులు, 11 మంది విటులను అరెస్టు చేశారు.

విజయవాడ, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి):

విజయవాడ గురునానక్‌ కాలనీకి చెందిన చలసాని ప్రసన్న భార్గవ్‌ వెటర్నరీ కాలనీలోని ఫీడర్‌ రోడ్లు స్టూడియో9 పేరుతో స్పా సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. కింద అంతస్తులో ఒక యూట్యూబ్‌ చానల్‌కు సంబంధించిన కార్యాలయం ఉంది. మొదటి అంతస్తులో స్పా సెంటర్‌కి సంబంధించిన రిసెప్షన, గదులు ఉన్నాయి. రెండో అంతస్తులో నాలుగు గదులు ఉన్నాయి. ఈ స్పాకు మంగళగిరికి చెందిన దగ్గుబాటి శ్యామ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. కిషోర్‌ అనే వ్యక్తి పేరు మీద లైసెన్స్‌ ఉన్నప్పటికీ మొత్తం వ్యవహారాలన్నీ భార్గవ్‌ కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ, ఘజియాబాద్‌, మధ్యప్రదేశ ప్రాంతాలకు చెందిన యువతులను ఉద్యోగాల పేరుతో రప్పించుకుని స్పా సెంటర్లో మసాజర్లుగా నియమించుకున్నారు. మసాజ్‌ల ముసుగులో వారితో ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను మొత్తం స్టింగ్‌ ఆపరేషన చేసి చిత్రీకరించి పోలీసు ఉన్నతాధికారులకు అందజేశాడు. దీంతో మాచవరం పోలీసులు స్పా కేంద్రంలో సోదాలు నిర్వహించడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. మొత్తం పది మంది యువతులు, 11 మంది విటులను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. క్యాష్‌ కౌంటర్లో ఉన్న రూ.10వేలు, నగదు చెల్లింపులకు ఉపయోగించే స్వైపింగ్‌ మిషన పోలీసులు సీజ్‌ చేశారు. మేనేజర్‌ శ్యామ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్పా ముసుగులో జరుగుతున్న రాసలీలల కార్యకలాపాలు బయటికి రావడంతో నిర్వాహకుడు భార్గవ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పట్టుబడిన యువతులను మహిళా సంరక్షణ కేంద్రాలకు తరలించారు.

మంచం కింద వైసీపీ నేత

వైసీపీ నేత, రాష్ట్ర ఎస్టీ కమిషన సభ్యుడిగా వ్యవహరించిన శంకర నాయక్‌ స్పా సెంటర్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఒక గదిలో మంచం కింద దాగివున్న అతడిని బయటకు లాక్కొచ్చారు. స్పా కేంద్రంలోకి వెళ్లిన శంకర్‌ నాయక్‌ ఒక యువతిని బుక్‌ చేసుకున్నాడు. ఆమె కంటే ముందుగానే రెండో అంతస్తులో ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఇంతలో పోలీసులు దాడులు చేస్తున్నట్టు తెలియడంతో మంచం కింద దాక్కోవడానికి ప్రయత్నించాడు. శంకర్‌ నాయక్‌ లావుగా ఉండటంతో ఇది సాధ్యపడలేదు. దీనితో మంచాన్ని పైకెత్తి దాని కింద పడుకుని తనపై మంచాన్ని వాల్చుకున్నాడు. తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్లిన పోలీసులు మంచం ఎత్తుపల్లంగా ఉండడాన్ని గమనించారు. దీనితో మంచం ఎత్తి చూడగా దాని కింద శంకర్‌ నాయక్‌ ఉన్నాడు. ఈ వీడియోను పోలీసులు చిత్రీకరించారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో అన్ని స్సా కేంద్రాలను మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా మసాజ్‌ సెంటర్‌ను నిర్వహించాలంటే దానికి కొన్ని నిబంధనలు విధించింది. అయితే ఇంతకుముందే పోలీసుల దెబ్బ రుచి చూసిన భార్గవ్‌ ఈసారి చాలా తెలివిగా వ్యవహరించారు. ఈ లైసెన్స్‌లన్నీ కిషోర్‌ అనే వ్యక్తి పేరు మీద తీసుకున్నారు. అతడి పేరుతో ఉన్న అనుమతులను చూపించి భార్గవ్‌ స్టూడియో9 పేరుతో స్పా నిర్వహిస్తున్నారు. ఇక్కడ రెండు అంతస్తుల్లో జరిగే అసాంఘిక కార్యక్రమాలు బయటికి రాకుండా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.

విటులను ఆకర్షించడానికి టెలీకాలర్‌ వ్యవస్థ

విటులను ఆకర్షించడానికి ముగ్గురు యువతులతో వేరే భవనంలో టెలీకాలర్‌ వ్యవస్థను నెలకొల్పాడు. వారికి మూడు ఫోన్లను కేటాయించాడు. వాటి నుంచి టెలీకాలర్‌లో ఉండే అమ్మాయిలు విటులకు ఫోన్లు చేస్తారు. ఆసక్తి ఉన్న వారు ఎక్కడికి వెళ్లాలో చిరునామాను టెలీకాలర్లే చెబుతారు. ఫీడర్‌ రోడ్‌లోని స్టూడియో9 భవనం వద్దకు చేరుకోగానే టెలీకాలర్లు కాల్‌సెంటర్‌ నుంచి మేనేజర్‌ శ్యామ్‌కి ఫోన చేసి విషయం చెబుతారు. మేనేజర్‌ సీసీ కెమెరాలు చూసి కింద ఉన్న విటులను మొదటి అంతస్తుకు రప్పించుకుంటారు. విటులు మొదటి అంతస్తులోకి వెళ్లేలా తలుపులు తెరుచుకోవడానికి కాల్‌ సెంటర్‌లోని అమ్మాయిలు తమ వద్ద ఉన్న ఒక స్విచ్‌ను ఆన్‌ చేస్తారు. రిసెప్షన్‌ వద్దకు వెళ్లిన తర్వాత మేనేజర్‌ శ్యామ్‌ యువతులను పిలిపించి సర్వీసు కావలసిన వారిని ఎంపిక చేసుకోవాలని చెబుతాడు. ఆ తర్వాత కౌంటర్లో డబ్బులు చెల్లించుకుని లోపలికి పంపుతారు. ఇక్కడున్న తలుపులు తెరుచుకోవడానికి టెలీకాలర్ల వద్ద ఒక బటన ఉంటుంది. లోపల జరిగే సర్వీసును బట్టి రూ.8వేల నుంచి రూ.12వేల వరకు యువతులు వసూలు చేస్తారని మేనేజర్‌ శ్యామ్‌ పోలీసు విచారణలో చెప్పినట్టు తెలిసింది. ఇది కాకుండా ఒక్కో మసాజ్‌కు రూ.2వేల నుంచి రూ.3వేలు వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని కౌంటరులో చెల్లించాల్సి ఉంటుంది. లోపలికి వెళ్లిన వ్యక్తులు బయటకు రావాలన్నా టెలీకాలర్‌ స్విచ నొక్కాలి. ఐపీ అడ్రస్‌ల ద్వారా మొత్తం నిఘా వ్యవస్థను నడిపిస్తున్నారు. డేటా మొత్తం క్లౌడ్‌లో భద్రంగా ఉండేలా సాంకేతిక వ్యవస్థను రూపొందించుకున్నారు.

గోడలు దూకి తప్పించుకునేందుకు ప్రత్యేక శిక్షణ

ఈ సాంకేతిక వ్యవస్థను ఛేదించుకుని పోలీసులు వస్తే ఉద్యోగులు, యువతులు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు భార్గవ్‌. ఉత్తరాది నుంచి వచ్చిన యువతులకు స్టూడియో9 భవనంలోని మూడో అంతస్తుపైన పెంట్‌హౌస్‌లో వసతి ఏర్పాటు చేశారు. పోలీసులు వచ్చిన వెంటనే గదుల్లో సర్వీసుల్లో ఉన్న యువతులు భవనం పైకి వెళ్లి పిట్టగోడ దాటుకుని పక్కనున్న భవనంలోకి వెళ్లిపోయేలా ఏర్పాటు చేశారు. యువతులు, విటులు భవనం దాటేసిన తర్వాత టెలీకాలర్లు తలుపులు తెరుచుకోవడానికి స్విచ్‌ ఆన్‌ చేస్తారు. ఆ తర్వాత పోలీసులు లోపలకు వెళ్లి ఎంత గాలించినా ఎలాంటి ఆధారం లభించదు. పలుమార్లు సోదాలకు వెళ్లిన పోలీసులకు ఇదే అనుభవం ఎదురైంది. తాజాగా మాచవరం పోలీసులు దాడి చేసినప్పుడు యువతులు, మేనేజర్‌ శ్యామ్‌ ఇదే పని చేశారు. పోలీసులు లోపలికి వెళ్లి ఎంత సేపు తలుపులు కొట్టినా తీయకపోవడంతో వారికి అనుమానం వచ్చి భవనంపైకి చూడగా యువతులు భవనాలు దాటుతున్నట్టు కనిపించింది. లోపల ఉన్న విటులు బయటకు రావడానికి వీలు లేకపోవడంతో వేలిముద్ర స్కానర్లను ధ్వంసం చేశారు. సాంకేతిక వ్యవస్థ పనిచేయడం మానేసిన తర్వాత పోలీసులు ప్రతి గదిని తనిఖీ చేసి లోపల ఉన్న కండోమ్‌ ప్యాకెట్లను సీజ్‌ చేసి విటులను పట్టుకున్నారు. పక్క భవనం ఎక్కి వాటర్‌ ట్యాంక్‌ కింద ఉన్న యువతులను సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు.

Updated Date - Feb 23 , 2025 | 01:21 AM