High Court: అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చలేదా?
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:57 AM
ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని డీజీపీ, సంబంధిత జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి
నివేదిక సమర్పించాలని ప్రకాశం ఎస్పీ, విశాఖ సీపీలకు ఆదేశం
విచారణ 18కి వాయిదా
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో నిందితుడు బోస రమణను పొదిలి పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చకుండా వదిలేయడం, ఎలాంటి రికార్డులూ నిర్వహించకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని డీజీపీ, సంబంధిత జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ ఎన్.హరినాథ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. తన భర్త బోస రమణను ప్రకాశం జిల్లా దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నం మద్దెలపాలెంకు చెందిన బోస లక్ష్మి గతేడాది నవంబరులో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, విశాఖ ఎంవీపీ పీఎ్‌సకు సమాచారం ఇచ్చి గతేడాది నవంబరు 6న నిందితుడు రమణను అరెస్ట్ చేసి పొదిలి తీసుకొచ్చామని, నేర ఒప్పంద వాంగ్మూలం నమోదు చేసి అదే రోజు సాయంత్రం బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చి విడిచి పెట్టేశామంటూ పొదిలి ఇన్‌స్పెక్టర్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ వివరణపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చకుండా నోటీసులు ఇచ్చి వదిలేశామని బాధ్యతగల పోలీస్ అధికారి అఫిడవిట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News