Share News

MP Mithun Reddy: మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jun 23 , 2025 | 09:56 PM

MP Mithun Reddy Bail Petition: పిటిషన్ పై విచారణ నాలుగు వారాల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయాన్ని మిథున్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

MP Mithun Reddy: మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
MP Mithun Reddy

మద్యం కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారం చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై వేరే న్యాయమూర్తి విచారణ ప్రారంభించారని న్యాయమూర్తి గుర్తు చేశారు.


అయితే, పిటిషన్ పై విచారణ నాలుగు వారాల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయాన్ని మిథున్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోమని ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు చెప్పారు. పిటిషన్‌పై విచారణను చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువెళ్లాలని హైకోర్ట్ రిజిస్ట్రీని ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

తమిళ హీరో శ్రీకాంత్ అరెస్ట్

మీ తెలివికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 27 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Jun 23 , 2025 | 10:01 PM