Sri Reddy: ముందస్తు బెయిల్ మంజూరు చేయండి
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:38 AM
తనపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సినీనటి విమల మల్లిడి అలియాస్ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.

హైకోర్టును ఆశ్రయించిన సినీనటి శ్రీరెడ్డి
అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): తనపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సినీనటి విమల మల్లిడి అలియాస్ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు
Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి