Share News

Kakani Govardhan Reddy: కాకాణికి లభించని ఊరట

ABN , Publish Date - Apr 22 , 2025 | 05:34 AM

ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసులో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించడాన్ని హైకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్‌ పరిధిపై తేల్చేందుకు ఈ వ్యవహారాన్ని ధర్మాసనానికి అప్పగిస్తూ న్యాయమూర్తి కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

Kakani Govardhan Reddy: కాకాణికి లభించని ఊరట

అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టు నిరాకరణ

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్‌

విచారణ పరిధి తేల్చే వ్యవహారం ధర్మాసనానికి

ఫైలు సీజే ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ చట్ట నిబంధనలకు అనుగుణంగా నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ పరిధిని తేల్చే వ్యవహారాన్ని ధర్మాసనానికి అప్పగిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు సోమవారం కీలక ఉత్తర్వులు ఇచ్చారు. బెంచ్‌ ఏర్పాటుపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఫైలును ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న కాకాణి తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చారు. విచారణ పరిధి తేల్చే వ్యవహారాన్ని ధర్మాసనానికి అప్పగించాక ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేనని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామపరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్జ్‌ ఖనిజాన్ని తవ్వి తరలించారని జిల్లా మైనింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బాలాజీనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ కాకాణి పిటిషన్‌ వేశారు.


చిలకలూరిపేట నియోజకవర్గం టీడీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి పిలి ్లకోటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద పెట్టిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ విడదల రజని పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఎస్పీ, ఎస్టీ కేసులలో మందస్తు బెయిల్‌ కోరుతూ మరికొందరు పిటిషన్లు వేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద కేసులు నమోదైనప్పుడు ముందస్తు బెయిల్‌ కోసం ముందుగా సంబంధిత ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి గతంలో తీర్పు ఇచ్చారు. అయితే నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చంటూ కాకాణి, రజని, మరికొందరు పిటిషనర్లు వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి తీర్పు రిజర్వ్‌ చేశారు. తాజాగా ఈ అంశాన్ని ధర్మాసనానికి అప్పగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 05:34 AM